Life Style
Yoga for Kids: ఈ ఆసనాలు వేస్తే పిల్లల బ్రెయిన్ కంప్యూటర్ కంటే షార్ప్ అవుతుంది!
యోగా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యోగా గురించి అందరికీ తెలుసు. యోగాతో నయం చేయలేని జబ్బు ఉండదు. పూర్వం ఎక్కువగా యోగాసనాలు వేసేవారు. దీంతో ఎంతో ఆరోగ్యకంగా ఉండేవారు. యోగా చేయడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలను సైతం యోగాతో తగ్గించుకోవచ్చు. అయితే యోగా ఎక్కువగా పెద్దలు మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు కూడా చేయవచ్చు. వీరికంటూ కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. వీటిని వేయడం వల్ల పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాకుండా వీరి బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. తెలివి తేటలు బాగా పెరుగుతాయి. మరి పిల్లలు ఎలాంటి ఆసనాలు వేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సర్వాంగాసనం:
పిల్లలు తరచూ సర్వాంగాసనం వేయడం వ్లల వీరి మేధస్సు అనేది మెరుగు పడుతుంది. శరీరం బాగా సాగుతుంది. ఏమైనా నొప్పులు ఉంటే తగ్గుతాయి. అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది.
బాల బకాసన:
పేరుకు తగ్గట్టుగానే ఈ ఆసనం పిల్లలు వేస్తారు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరం అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది. యోగాసనాలు వేయడం వల్ల వారు భవిష్యత్తులో డ్యాన్స్ నేర్చుకోవడంలో హెల్ప్ అవుతుంది. శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే బ్రెయిన్ యాక్టీవ్ అవుతుంది.
వృక్షాసనం:
వృక్షాసనం పెద్దలు, పిల్లలు కూడా వేయవచ్చు. ఈ యోగాసనం చేయడం చాలా సింపుల్. పిల్లలు ఈ ఆసనం చేయడం వల్ల వీరి శరీరం బ్యాలెన్స్ అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
గరుడాసనం:
ఈ ఆసనం వేయడం కూడా చాలా సులభం. కానీ ఈ ఆసనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దీని వల్ల వీరికి ఏకాగ్రత, దృష్టి సారించడం పెరుగుతుంది. దీంతో మతి మరుపు దూరమై జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
పద్మాసనం:
పద్మాసనం వేయడం కూడా చాలా సులభం. ఈ ఆసనాన్ని ఎవరైనా చేయవచ్చు. పద్మాసనం అభిజ్ఞా పనితీరును మెరుగు పరుస్తుంది. మేధస్సును పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. తెలివి తేటలు కూడా పెరుగుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు infoline.one బాధ్యత వహించదు.)