Business
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
వర్క్ ఫ్రం హోమ్‌ను పూర్తి స్థాయిలో తొలగించి.. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ కంపెనీలు విభిన్న మార్గాలు అవలంభిస్తున్నాయి. ఆ వివరాలు.
కరోనా వచ్చిన దగ్గర నుంచి పని చేసే విధానం, వాతావరణం పూర్తిగా మారిపోయింది. కోవిడ్‌కు ముందు.. జాబ్ అంటే కచ్చితంగా ఆఫీసుకు వెళ్లాల్సిందే. ఆఫీసు ప్రాంగణంలో నిర్దిష్టమైన పని గంటలు గడపాల్సిందే. అయితే కోవిడ్ విజృంభణ తర్వాత.. ఐటీ కంపెనీలు సహా.. చాలా రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇంటి నుంచే పని విధానం అమల్లోకి వచ్చింది. లాక్‌డౌన్ విధింపు, ఆంక్షల నేపథ్యంలో కంపెనీలు మరీ ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు తమ ఓటు వేశాయి. సుమారు మూడేళ్లుగా ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోం కొనసాగుతోంది. ఇప్పుడు కరోనా భయం తొలగిపోయింది.. వ్యాక్సినేషన్ కూడా పూర్తయ్యింది. దాంతో ఇన్నాళ్లు వర్క్ ఫ్రం హోమ్‌కు అనుమతిచ్చిన కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిందిగా కోరుతున్నాయి. చాలా కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పూర్తిగా తీసేశారు.
కానీ ఐటీ కంపెనీల్లో మాత్రం ఇది ఇంకా కొనసాగుతేనే ఉంది. ఆఫీసులకు రావాల్సిందిగా ఉద్యోగులను కోరుతున్నప్పటికి వారు పెద్దగా స్పందించడం లేదు. దాంతో హైబ్రీడ్ మోడల్‌ను అమలు చేస్తున్నారు. అంటే వారంలో కచ్చితంగా మూడు రోజులు ఆఫీసుకు రావల్సిందే. ఇక నెమ్మదిగా దీన్ని కూడా తొలగించే ప్రయత్నాల్లో ఉన్నాయి ఐటీ కంపెనీలు. ఉద్యోగులను పూర్తి స్థాయిలో కార్యాలయాలకు రప్పించడం కోసం అనేక మార్గాలను అమలు చేస్తున్నాయి. వీటిల్లో కొన్ని కంపెనీలు అయితే ఏకంగా జీతంలో కోతలు విధించేందుకు రెడీ అవుతున్నాయి. ఆ వివరాలు..
కాగ్నిజెంట్..
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్.. ఉద్యోగులను కార్యాలయానికి రప్పించేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తుంది. దీనిలో భాగంగా ఓ యాప్‌ను తీసుకువచ్చింది. ఉద్యోగుల రాకపోకలను గమనించడానికి ఉద్దేశించి.. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్లెక్సీసీట్ అనే యాప్‌ను తీసుకుంచ్చింది. దీని ద్వారా మేనేజర్స్.. టీమ్, పని అవసరాల మేరకు రోస్టర్ తయారు చేస్తారు. అలనే కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులు కనీసం వారంలో మూడు రోజులైనా ఆఫీసుకు రావాల్సి ఉంటుంది అని తెలిపారు
టీసీఎస్..
వర్క్ ఫ్రం హోమ్‌ను పూర్తి స్థాయిలో మాన్పించి.. ఉద్యోగులను ఆఫీసుకు వచ్చేలా చేయడం కోసం టీసీఎస్ కాస్త కఠిన నిర్ణయమే తీసుకుంది. గత నెల వరకు కూడా హైబ్రీడ్ విధానం.. అంటే వారంలో మూడు రోజులు ఆఫీసు పద్దతిని అవలంభించిన కంపెనీ.. దాన్ని పూర్తి స్థాయిలో ఎత్తి వేసింది. ఇకపై ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు రావల్సిందేనని.. లేదంటే జీతంలో కోతలు విధిస్తామని హెచ్చరించింది.
విప్రో..
ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడం కోసం విప్రో సరికొత్త విధానాన్ని ఎంచుకుంది. వారు ఇంటి వద్ద నుంచి పని చేసే వీలు లేకుండా.. కేవలం ఆఫీసు నుంచే పని చేసేలా సరికొత్త విధానాలను అమలు చేయడానికి రెడీ అవుతోంది. ఈమేరకు చీఫ్ హెచ్‌ఆర్‌ఓ సౌరభ్ గోవిల్ దీనిపై ప్రకటన చేశారు.
ఇన్ఫోసిస్..
ఇక ఇన్ఫోసిస్.. ఉద్యోగుల అనుభవాలును వెల్లడించే ప్లాట్‌ఫామ్ ఇన్ఫిమీ ద్వారా.. కొన్ని విభాగాల ఉద్యోగులకు నెలకు 11 రోజుల పాటు వర్క్ ఫ్రం హోమ్‌ను అనుమతించేందుకు రెడీ అయ్యింది. గత ఏడాది ఇన్ఫోసిస్.. కొందరు జూనియర్లు. మిడ్ లెవల్ ఉద్యోగులను ఆఫీసుకు రావాల్సిందిగా కోరింది.