News
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
కొత్త ట్రాఫిక్ రూల్స్ 2024 జూన్ 1 నుంచి అమలు కానున్నాయి. ఇకపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే జేబులు గుల్ల కావడం ఖాయం.
ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం(RTO) 2024 జూన్ 1 నుంచి కొత్త వాహన నియమాలను జారీ చేయనుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన, భారీ జరిమానాలను కూడా విధించనున్నారు. ఇదిలా ఉంటే జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు మారునున్న సంగతీ తెలిసిందే..
కొత్తగా వచ్చిన ట్రాఫిక్ నిబంధనలు ఈ విధంగా ఉండనున్నాయి..
కొత్త నిబంధన ప్రకారం అతి వేగంగా వాహనాలు నడిపినట్లు పట్టుబడితే రూ.1000 నుంచి 2000 వరకు జరిమానా విధించనున్నారు.
అదే సమయంలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
18 ఏళ్ల లోపు వారు వాహనం నడిపితే వారికి రూ. 25వేలు ఫైన్ వేస్తారు. ఇవే కాకుండా హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడిపితే రూ.100 ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
మైనర్ కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు.