Andhrapradesh

Vishalakshi Devi: కాశీలోని ఈ శక్తి పీఠం ప్రసిద్ధి చెందింది.. అమ్మవారి దర్శనంతో అన్ని కోరికలు నెరవేరతాయి.

Published

on

కాశీ లేదా వారణాసి మన దేశంలో అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కాశి లయకారుడైన శివయ్యకు అంకితం చేయబడిన క్షేత్రం. దేశంలోని మతపరమైన రాజధానిగా పరిగణించబడుతున్న కాశీ నగరం కేవలం విశ్వనాథునికే కాదు శక్తిపీఠానికి కూడా ప్రసిద్ధి. ఈ నగరం శక్తి ఆరాధనకు కూడా కేంద్రంగా ఉంది. అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా మారాయని ప్రతీతి. మొత్తం 51 శక్తిపీఠాలు పరిగణించబడుతున్నాయి.

సతీదేవి మృత దేహాన్ని తన భుజంపై పెట్టుకుని శివుడు తిరుగుతున్నప్పుడు.. విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరం ఖండించగా శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి. అలా సతీదేవి ఒక భాగం పడిన ప్రదేశం నేడు విశాలాక్షి పవిత్ర నివాసంగా పిలువబడుతుంది.

ఈ శక్తిపీఠాలన్నింటిని సందర్శించి శివుడు ధ్యానం చేశాడని, అతని రూపం నుండి కాలభైరవుడిని సృష్టించాడని నమ్ముతారు. కాశీలోని ఈ శక్తిపీఠానికి సమీపంలోనే కాలభైరవుడు కూడా ఉన్నాడు. విశాలాక్షి దేవి దివ్య నివాసం భక్తి, శక్తి , శ్రేయస్సును అందించే పవిత్రమైన 51 శక్తిపీఠాలలో ఒకటి.

హిందూ మత విశ్వాసాల ప్రకారం బా విశ్వనాథుని భార్యగా కాశీలో తల్లి విశాలాక్షి ఉంది. ప్రతి రాత్రి బాబా విశ్వనాథుడు ఇక్కడే నిద్రిస్తారు. కాశీలోని అమ్మవారి ఈ శక్తి పీఠంలోని విశాలాక్షి దేవి దర్శనం కోసం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

51 శక్తిపీఠాలలో ఒకటి
విశాలాక్షి ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. కథల ప్రకారం తల్లి కుడి చెవి, చెవిపోగు లేదా కన్ను ఈ ప్రదేశంలో పడింది. అందుకే ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దసరా నవరాత్రి రోజుల్లో ఇక్కడ భారీ రద్దీ నెలకొంటుంది. చాలా పొడవైన క్యూలు కనిపిస్తాయి. కాశీలో ఉన్న విశాలాక్షి దర్శనం వల్ల రోగాలు, దుఃఖాలు మొదలైనవి పోయి సంతానం కలుగుతుంది. వివాహం చేసుకోలేని, లేదా వివాహంలో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొనే అమ్మాయిలు విశాలాక్షిని వరుసగా 41 రోజులు దర్శనం చేసుకోవడం ద్వారా వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Advertisement

ఆలయ నిర్మాణం
ఈ విశాలాక్షి ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. దీని ఆకారం దక్షిణ భారతదేశంలోని దేవాలయాలను పోలి ఉంటుంది. దేశంలోని సుదూర ప్రాంతాల నుండి భక్తులే కాకుండా, పెద్ద సంఖ్యలో దక్షిణ భారత భక్తులు కూడా ఈ ఆలయానికి దర్శనం కోసం వస్తుంటారు. ఇక్కడ అమ్మవారికి పూలమాలలు, పూలు, ప్రసాదాలతో పాటు అలంకరణ వస్తువులు సమర్పిస్తారు.

పురాణాల ప్రకారం
పురాణాల ప్రకారం శివుని భార్య సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజభవనంలో ఒక యాగంలో తన భర్త చేసిన అవమానానికి బాధపడిన సతి, అదే యాగశాలలో తన శరీరాన్ని విడిచింది. ఆ తర్వాత శివుడు సతీదేవి మృత దేహంతో కల్యాణం ప్రారంభించాడు. ఈ సమయంలో సృష్టిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసాడు. సతీదేవి శరీరభాగం పడిన ప్రదేశాలను శక్తిపీఠాలు అని అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version