National

పూరీ జగన్నాథ్ భక్తుడి కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్​గ్రేషియా- గాయపడిన వారంతా సేఫ్!

Published

on

Rath Yatra Overcrowding : ఒడిశాలో పూరీ జగన్నాథుడి రథయాత్రలో తోపులాట కారణంగా ప్రాణాలు కోల్పోయిన భక్తుడి కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. క్షతగాత్రులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి ఆదేశించారు. మృతుడిని లలిత్ బగర్తిగా పోలీసులు గుర్తించారు.

అసలేం జరిగిందంటే?
తాళధ్వజ రథాన్ని లాగుతున్న సమయంలో లలిత్ స్పృహతప్పి పడిపోయాడు. దీంతో ఆయనను వెనక ఉన్నవారు తొక్కేశారు. పోలీసులు ఆస్పత్రికి తరలించినా భక్తుడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భక్తుల రద్దీ తీవ్రంగా ఉండడం వల్ల ఉక్కపోత వల్ల 300 మంది స్పృహతప్పారు. చికిత్స అనంతరం వారంతా కోలుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version