Life Style
మనిషి అంతిమ కర్తవ్యం ఏమిటి దాన్ని ఎలా సాధించాలి?

సాధారణంగా ప్రతి మనిషికి అంతిమ కర్తవ్యం ఉండాలని చెబుతుంటారు. అయితే అసలు మనిషి నిర్వహించాల్సిన అంతిమ కర్తవ్యం ఏంటి? దాన్ని ఎలా సాధించాలి ?
అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పుట్టిన ప్రతి మనిషి తన జీవితాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఎదుటి వారికి చేయగలిగినంత సాయం చేయాలని పెద్దలు చెబుతున్నారు. మానవత్వంతో పాటు సేవ చేయడం, ఇతరులకు సాయం చేయడం ప్రతి మనిషిలో ఉండాలని తెలియజేస్తున్నారు. సంతోషకరమైన జీవితాన్ని గడపడమే కాకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలి. అంతేకాదు ఇతరుల కోసం జీవిస్తూ.. వారి ఎదుగుదలకు తోడ్పాటును అందించాలని పెద్దలు, ప్రవచన కర్తలు సూచిస్తుంటారు.
అయితే నార్మల్ గా ప్రతి మనిషి తన మనసు ఏది చెబితే దాన్ని చేస్తుంటాడు. దాన్నే కర్తవ్యంగా భావిస్తుంటారు. జీవితంలోని ప్రతి ప్రయాణంలో మీతో పాటు మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ముందుకు నడిపించాలి. కర్తవ్యం అంటే మీ సహాయం కోరే ఇతరుల పట్ల దయతో ఉంటూ వారికి చేయగలిగినంత హెల్ప్ చేయడమేనని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మనిషి జీవితం కర్తవ్య సాధనలో సంపూర్ణం కావాలంటే కొన్ని ప్రాథమిక అంశాలను తప్పనిసరిగా పాటించాలట. ఇతరులకు తప్పనిసరిగా సాయం చేయాలి.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనే మర్యాదగా ప్రవర్తించాలి..ఉన్న దానితో సంతృప్తి చెందాలి.. అంతేకాదు ఆనందం, ప్రేమను పంచుతూ ప్రతి ఒక్కరిని గౌరవించాలి. మనకు ఉన్న భౌతిక లేదా అభౌతిక అంశాలతో సంతోషంగా జీవితంలో రాణించాలి.
ఈ విధంగా చేయడం వలన జీవితాన్ని సాకారం చేసుకోవడంతో పాటు కర్తవ్యాన్ని సాధించవచ్చని పేర్కొంటున్నారు. కర్తవ్య సాధన కోసం ఖరీదైన వస్తువులు, నగదే ఉండాల్సిన పని లేదు. ఉన్నదానితో సంతృప్తి చెందితే సరిపోతుందని పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే మీ కోసమే కాకుండా ఇతరుల కోసం, దేశం కోసం బాధ్యతలను స్వీకరించి నిర్వర్తించాలని స్పష్టం చేస్తున్నారు. అందుకే పరోపకారమే ప్రతి మనిషి ప్రధాన కర్తవ్యమని చెబుతున్నారు.