National

Lok Sabha Elections Phase 2 : లోక్​సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​ షురూ..

Published

on

Lok Sabha Elections 2024 phase 2 live updates : ప్రధాని మోడీ వర్సెస్​ కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం నెలకొన్న తరుణంలో 2024 లోక్​సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​పై ఫోకస్​ పెరిగింది. రెండో దశ పోలింగ్​ లైవ్​ అప్డేట్స్​ కోసం ఈ హెచ్​టీ తెలుగు పేజ్​ని ఫాలో అవ్వండి.

ఓటేసిన సుధా మూర్తి..
ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి.. బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

పోలింగ్​ షురూ..
2024 లోక్​సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​ ప్రక్రియ ప్రారంభమమైంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మణిపూర్​లో ఓ 94ఏళ్ల వృద్ధురాలు.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

7 దశల్లో పోలింగ్​..
2024 లోక్​సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనుంది. మూడో దశ పోలింగ్​ మే 7న జరుగుతుంది. జూన్​ 4న ఫలితాలు వెలువడతాయి.

1,210 మంది అభ్యర్థులు..
రెండో దశ పోలింగ్​లో మొత్తం 1,210 మంది అభ్యర్థులు బరిలో దిగారు. వీరిలో 74 మంది బీఎస్​పీ, 69 మంది బీజేపీ, 68 మంది కాంగ్రెస్​ టికెట్​తో పోటీ చేస్తున్నారు.

Advertisement

మాక్​ డ్రిల్స్​..
2024 లోక్​సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​ ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో.. అన్ని పోలింగ్​ స్టేషన్స్​లో మాక్​ డ్రిల్స్​ జరుగుతున్నాయి.

89 స్థానాల్లో..
వాస్తవానికి ఈ దఫా పోలింగ్​లో 89 సీట్లకు పోలింగ్​ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్​ బేటుల్​ నియోజకవర్గం పోలింగ్​ని మే 7కు వాయిదా వేశారు. బీఎస్​పీ అభ్యర్థి మరణం ఇందుకు కారణం.

బరిలో ప్రముఖులు..
2024 లోక్​సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​లో చాలా మంది ప్రముఖులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా.. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ పోటీ చేస్తున్న కేరళ వయనాడ్​లో శుక్రవారం పోలింగ్​ జరగనుంది. కాంగ్రెస్​ నేత శశిథరూర్​, బజేపీ హేమ మాలిని కూడా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మొత్తం 88 సీట్లు..
మొత్తం 20 రాష్ట్రాల్లో శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో 14 సీట్లు కర్ణాటకలో, 13 సీట్లు రాజస్థాన్​లో, 8 సీట్లు ఉత్తర్​ ప్రదేశ్​లో, 8 సీట్లు మహారాష్ట్రలో, 7 సీట్లు మధ్యప్రదేశ్​లో ఉన్నాయి.

రెండో దశ పోలింగ్​కు వేళాయే..
భారత్​లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం.. 2024 లోక్​సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​కు సమయం ఆసన్నమైంది. ఈ దఫా పోలింగ్​లో మొత్తం 88 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ పోలింగ్​ ఏప్రిల్​ 19న ముగిసిన విషయం తెలిసిందే.

Advertisement

Read also:

  • 🗳తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం.. పెద్ద ఎత్తున పోటీ పడ్డ స్వతంత్య్ర అభ్యర్థులు.. https://infoline.one/telugu-states-nominations-end/
  • Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ; గుజరాత్ లో తొలి విజయం https://infoline.one/lok-sabha-elections/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version