Life Style

Lemon for Dandruff: నిమ్మ రసంతో చుండ్రు తగ్గిపోతుందా.. ఇందులో నిజమెంత!

Published

on

చాలా మందిని వేధించే జుట్టు సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతూ ఉంటారు. చుండ్రు కారణంగా తలలో ఎక్కువగా దురద కూడా వస్తుంది. జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. చుండ్రు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, పొడి చర్మం, తలలో ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అవడం, తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి కారణాల వల్ల చుండ్రు సమస్య అనేది తలెత్తుతుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు చాలా మంది.. నేరుగా జుట్టుకు నిమ్మ రసాన్ని రాస్తూ ఉంటారు. అయితే నిమ్మ రసాన్ని నేరుగా రాయడం వల్ల నిజంగానే చుండ్రు సమస్య తగ్గుతుందా.. లేదా.. దీని వల్ల జుట్టుకు ఎలాంటి ప్రమాదం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

చుండ్రు, దురద తగ్గుతాయి..
నిమ్మ రసంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తలపై నిమ్మరాసాన్ని రాయడం వల్ల చుండ్రు సమస్య, దురద అనేవి తగ్గుతాయి. దీనిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రును తగ్గించడంలో ఎంతగానో హెల్ప్ చేస్తాయి. నిమ్మ రసం రాసుకోవడం వల్ల జుట్టుకు ఎటువంటి హాని కలగదు. చుండ్రు సమస్యతో బాధ పడేవారు తల చర్మానికి నిమ్మ రసాన్ని రాసుకుని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆ తర్వాత తల స్నానం చేయాలి.

కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవచ్చు..
నిమ్మ రసం రాసినప్పుడు దానిలో ఉండే ఆమ్లతత్వం కారణంగా తల చర్మంపై మంటగా ఉంటుంది. నిమ్మ రసం వల్ల ఏదైనా అలెర్జీ వంటి సమస్యలు వచ్చేవారు మాత్రం నేరుగా రాయకుండా.. కొబ్బరి నూనెలో కలిపి రాసుకోవచ్చు.కొబ్బరి నూనెలో నిమ్మ రసాన్ని కలిపి రాయడం వల్ల.. నిమ్మ రసం గాఢత తగ్గి మంట రాకుండా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version