Life Style
Electricity bill: ఈ సింపుల్ టిప్స్‌తో ఎండాకాలంలో మీ కరెంట్ బిల్లును సగానికి తగ్గించేయొచ్చు..
ఎండాకాలంలో సూర్యుడు మండిపోతున్నాడు. డే టైమ్‌లో అడుగు బయట పెట్టలేని పరిస్థితి. వేడి, ఉక్కపోతతో జనం చుక్కలు చూస్తున్నారు. ఈ సమయంలో బడ్జెట్ సహకరించినా, సహరించకపోయినా.. ఎలాగోలా కూలర్లు తెచ్చుకుంటున్నారు. ఏసీలు ఫిట్ చేయిస్తున్నారు. ఇక ఫ్రిజ్ లేకపోతే ఎండాకాలంలో చాలా కష్టం. ఇవన్నీ వాడుతుంటే.. కరెంట్ బిల్లు షాక్ కొడుతుంది. రెండు, మూడు నెలల్లో వచ్చే బిల్లు.. ఒక్క నెలలోనే వస్తుంది. అయితే, వీటిని వాడుతూ కూడా కరెంటు బిల్లు తక్కువగా వచ్చేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. యూనిట్లు పెరిగితే శ్లాబు రేటు మారిపోతుంది. కరెంట్ బిల్ డబుల్ అవుతుంది. అందుకే క్రమపద్ధతిలో కరెంట్ వాడితే అధిక బిల్లులకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
1. ఏసీ వాడేవారు ఇలా చెయ్యండి
ఏసీ వాడటం కూడా ఒక ఆర్ట్ అండోయ్. ఏసీ పాయింట్లు బాగా తగ్గిస్తే, ఇల్లు త్వరగా కూల్ అవుతుందని భావిస్తుంటారు. కానీ ఏసీ పాయింట్లను ఇలా మరీ తగ్గించకూడదంటున్నారు నిపుణులు. ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల మధ్యే ఉంచితే.. లోడ్ భారం అదుపులో ఉంటుందట. ఎప్పుడూ 24 నుంచి 26 మధ్య ఉంచితే రూ.300 వరకు బిల్లు తగ్గుతుందని పక్కాగా చెప్పేస్తున్నారు. ఇక ఏసీ ఉన్న రూమ్‌లో చల్లదనాన్ని గ్రహించే వస్తువులు లేకుండా చూసుకోవడం మరో మధ్య. బీరువా వంటి ఇనుప వస్తువులు ఏవి ఉన్నా అవి చల్లదనాన్ని గ్రహించడం వల్ల.. రూమ్ కూల్ అవ్వడం లేట్ అవుతుంది. అలాగే సూర్యకిరణాలు ఏసీ ఉన్న రూమ్‌లోకి రాకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు ఇంటి తలుపులు, డోర్లు క్లోజ్ చేసి ఉంచండి.
2. ఫ్రిజ్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించింది
మీరు ఇంట్లో యూజ్ చేస్తున్న రిఫ్రిజిరేటర్ పాతది అయితే.. నెలకు 160 యూనిట్లకు పైగానే విద్యుత్ కాలుతుంది. అదే స్మార్ట్ ఫ్రిజ్ అయితే అవసరమైనప్పుడే ఆన్ అవుతాయి. లేకుంటే ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. వీటివల్ల విద్యుత్ బిల్లు రూ.300 వరకు తగ్గే అవకాశముంది. ఫ్రిజ్ డోర్‌ని ఎల్లప్పుడూ ప్రొపర్‌గా క్లోజ్ చేసి ఉంచాలి.
3. LED బల్బులను వినియోగించండి…
చాలామంది ఇప్పుడు కూడా పాత ఫిలమెంట్ బల్బులు, సీఎఫ్‌ఎల్‌లను వాడుతున్నారు. ఈ పాత బల్బులు ఎక్కువ కరెంట్ తీసుకుంటాయి. LED బల్బులు వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది.