Andhrapradesh

AP Telangana Nominations : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం – ఎంత మంది వేశారంటే..?

Published

on

Elections in AP Telangana 2024 : తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్ 25 చివరి తేదీ కావటంతో…. చివరి రోజు భారీగా నామినేషన్ల దాఖలు అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీని ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి….

  • తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు(ఏప్రిల్ 25) కావటంలో పెద్ద స్థాయిలో నామినేషన్లు వచ్చాయి.

  • తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 547 మంది నుంచి నామినేష్లు దాఖలయ్యాయి.. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంది.
  • ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.
  • ఆంధ్రప్రదేశ్ లో చూస్తే… 25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 4,210 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు.
  • ఏపీలో కూడా నామినేషన్‌ ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్‌ జరగనుంది.
  • జూన్ 4వ తేదీన ఏపీ, తెలంగాణలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
  • నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత… బరిలో ఉండే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.

Read also:

  • 🗳తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం.. పెద్ద ఎత్తున పోటీ పడ్డ స్వతంత్య్ర అభ్యర్థులు.. https://infoline.one/telugu-states-nominations-end/
  • Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ; గుజరాత్ లో తొలి విజయం https://infoline.one/lok-sabha-elections/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version