Andhrapradesh

AP ECET 2024: ఏపీ ఈసెట్‌ నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్, ఏప్రిల్ 15వరకు దరఖాస్తుల స్వీకరణ

Published

on

AP ECET 2024: ఇంజనీరింగ్‌ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్‌ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీ ఈసెట్‌ 2024 నోటిఫికేషన్ ‍Notification విడుదలైంది. జేఎన్‌టియూ JNTU అనంతపురం Anantapuram ఆధ్వర్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్ సెట్‌ 2024 నిర్వహించనున్నారు. ఏపీలో సెట్ల నిర్వహణ షెడ్యూల్‌ను ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తాజాగా ఈసెట్ 2024 నోటిఫికేషన్‌ను ఈసెట్ కన్వీనర్ విడుదల చేశారు.
మూడేళ్ల డిప్లొమా కోర్సుల తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం ఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్ధులు ప్రవేశాలు పొందవచ్చు.

2024-25 విద్యా సంవత్సరంలో రెండో ఏడాది Lateral Entry ఇంజనీరింగ్ Engineering కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 8వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు ఓ సెషన్, మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్న వరకు మరో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

ఈసెట్‌ 2024 ప్రవేశాల కోసం మార్చి 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఏపీ ఈసెట్‌ 2024 ఇన్ఫర్మేషన్ బ్రోచర్, విద్యార్హతలు, కోర్సుల వారీగా అర్హతలు, ఇంజనీరింగ్, టెక్నాలజీ డిప్లొమాల వారీగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించే కోర్సుల వివరాలు, సీట్ల లభ్యత, యూనివర్శిటీల పరిధిలో కళాశాలల జాబితా వంటి వివరాలు నోటిఫికేషన్‌‌ బ్రోచర్‌లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్ వెల్లడించారు.

ఏపీ ఈసెట్ 2024 దరఖాస్తులను https://cets.apsche.ap.gov.in/ECET లో శుక్రవారం అర్థరాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయి.

ఈసెట్ పరీక్షలో 200మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 50 మార్కులు మ్యాథ్స్‌ నుంచి ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. మరో 100 మార్కులు సంబంధిత విభాగానికి సంబంధించినవి ఉంటాయి. ఫార్మసీ విభాగంలో ఫార్మాస్యూటిక్స్‌లో 50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో 50, ఫార్మాకాగ్నసీలో 50, ఫార్మాకాలజీలో 50 మార్కలుకు ప్రశ్నలు ఉంటాయి. బిఎస్సీ విద్యార్హతతో దరఖాస్తు చేసేవారికి మ్యాథ్స్‌లో 100 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీలో 50, కమ్యూనికేషన్ ఇంగ్లీష్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. అగ్రికల్చర్ బిఎస్సీ ప్రవేశాలకు డిప్లొమా కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

Advertisement

ఈసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునే వారు ఏపీ ఆన్లైన్‌ కేంద్రాల్లో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ గేట్‌వేల ద్వారా కూడా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్‌ కార్డు, నెట్ బ్యాంకింగ్‌తో ఫీజులు చెల్లించవచ్చు.

ఓసీ అభ్యర్ధులు రూ.600, బీసీ విద్యార్ధులు రూ.550, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.500 ఫీజుగా చెల్లించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version