Space
భూమిని తాకిన సౌర తుపాను- ఆకాశంలో అనేక రంగులు- శాటిలైట్, పవర్ గ్రిడ్‌కు అంతరాయం! – Solar Storm 2024
Solar Storm 2024 : రెండు దశాబ్దాలలో చూడని శక్తిమంతమైన సౌరతుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది. ఫలితంగా భారత్‌లోని లద్దాఖ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకాశంలో అరోరాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల కొన్నిచోట్ల విద్యుత్ గ్రిడ్లకు, కమ్యూనికేషన్, ఉపగ్రహ పొజిషనింగ్ వ్యవస్థల్లో స్వల్ప అవరోధాలు ఏర్పడ్డాయి. కానీ, పెద్ద ఇబ్బందులేమీ తలెత్తలేదు. ఆదివారం కూడా ఇవి కొనసాగుతాయని అమెరికాలోని నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌వోఏఏ) పేర్కొంది.
రంగు రంగుల్లో ఆకాశం
ఉత్తర ఐరోపా నుంచి ఆస్ట్రేలియా వరకు ఆకాశం రంగు రంగుల్లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. నార్తర్న్ లైట్స్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆ లైట్స్ కంటికి నేరుగా కనిపించినట్లు బ్రిటన్‌లో స్థానికులు చెప్పారు. టాస్మానియాలో మాత్రం శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆకాశంలో ఆరోరాలు దర్శనమిచ్చాయి. లద్దాఖ్‌లోని హాన్లే డార్క్ స్కై రిజర్వు ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆకాశం అరుణ వర్ణపు శోభను సంతరించుకుంది.
తాజా సౌర తుపానుకు సౌరగోళంలోని ఏఆర్13664 అనే ప్రాంతంలో ఏర్పడ్డ ఒక సౌరమచ్చ కేంద్రంగా ఉంది. సౌర తుఫాన్ వల్ల అయస్కాంత క్షేత్రంలో మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయని, అందుకే శాటిలైట్ ఆపరేటర్లు, ఎయిర్‌లైన్స్, పవర్ గ్రిడ్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనాల్ మాస్ ఎజెక్సన్స్ సూర్యుడి నుంచి వెలుబడ్డనట్లు నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది. అయితే సౌర తుఫాన్ తీవ్రంగా ఉండటం వల్ల ఎక్స్‌ట్రీమ్ జియోమాగ్నిక్ స్టార్మ్‌గా అప్‌గ్రేడ్ చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని కరోనాల్ మాస్ ఎజెక్సన్స్ భూమిని తాకే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు.
వ్యోమగాములు సేఫ్
మరోవైపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఏడుగురు వ్యోమగాములకు ఈ సౌర తుపాను వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లలేదని నాసా తెలిపింది. రేడియేషన్ స్థాయిలు పెరగడం ఆందోళ కలిగించే విషయమేనని, అవసరమైతే సిబ్బందిని స్టేషన్‌లోని సురక్షిత భాగానికి తరలిస్తామని పేర్కొంది.
International
అంతరిక్ష కేంద్రంలో సునీత డ్యాన్స్- హగ్ చేసుకుని ఫుల్ ఖుషీ- వీడియో చూశారా? – Sunita Williams Space Trip
Sunita Williams Space Video : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌లు సైతం ప్రయాణించిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక గురువారం విజయవంతంగా ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైంది. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం గంటకొట్టి వారిని ఆహ్వానించారు.
సునీత డ్యాన్స్ సూపర్!
ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న సునీత డ్యాన్స్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆలింగనం చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తపర్చారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్ స్పేస్ తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా ప్రస్తుతం అది వైరలవుతోంది. సునీత చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఐఎస్‌ఎస్‌లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు. వారిని కలిసిన సందర్భంగా తాను ఆ విధంగా వేడుక చేసుకున్నానని తెలిపారు.
Hugs all around! The Expedition 71 crew greets Butch Wilmore and @Astro_Suni aboard @Space_Station after #Starliner docked at 1:34 p.m. ET on June 6. pic.twitter.com/wQZAYy2LGH
— Boeing Space (@BoeingSpace) June 6, 2024
గంట ఆలస్యమైనప్పటికీ!
అయితే బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇది తొలి మానవసహిత యాత్ర. అంతకుముందు హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్-కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కాగలిగింది. ఐఎస్‌ఎస్‌కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్‌మోర్‌లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలో కూడా ఈ క్యాప్సూల్‌ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని చెప్పారు.
గణేశుడి విగ్రహాన్ని!
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. ఆమె ఒక మారథాన్ రన్నర్. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Space
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా- ఈసారి ఏమైందంటే?
Sunita Williams Space Tour : బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌక ప్రయోగం మరోసారి వాయిదాపడింది. ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం కావాల్సింది. ప్రయోగానికి సరిగ్గా 3 నిమిషాల 50 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ను కంప్యూటర్ వ్యవస్థ శనివారం నిలిపివేసింది. దీనికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. డేటాను విశ్లేషిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రయోగం ఆదివారం జరిగే అవకాశం ఉంది. గత నెల 6న ఈ వ్యోమనౌక ప్రయోగానికి తొలి ప్రయత్నం జరిగింది. అయితే లీకేజీల సమస్య కారణంగా అది వాయిదా పడింది. నిజానికి ఈ యాత్ర ఎన్నో ఏళ్ల కిందట జరగాల్సింది. సాంకేతిక సమస్యల కారణంగా అది వాయిదా పడుతూ వస్తోంది.
International
Sunita Williams space mission : చివరి నిమిషంలో.. సునీత విలియమ్స్ 3వ స్పేస్ మిషన్ రద్దు!
Boeing Starliner launch : భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ 3వ స్పేస్ మిషన్.. చివరి నిమిషంలో రద్దు అయ్యింది. మరో వ్యోమగామితో కలిసి ఆమె ప్రయాణించాల్సిన బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ రాకెట్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మిషన్‌ని నిలిపివేశారు!
బోయింగ్ స్టార్‌లైనర్‌కు అడుగడుగునా అడ్డంకులు..
తొలి మానవసహిత స్టార్‌లైనర్ మిషన్‌ని బోయింగ్ కంపెనీ.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కానీ ఈ మిషన్కి అడుగడుగునా అడ్డంకులు ఎదరవుతూ వచ్చాయి. ఫలితంగా.. రాకెట్ లాంచ్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక అంతా సిద్ధం అనుకున్న సమయంలో.. సునీత విలియమ్స్ 3వ స్పేస్ మిషన్ రద్దు అయ్యింది. అట్లాస్ వీ రాకెట్ పైభాగంలోని వాల్వ్‌లో అనుమనాస్పద ప్రవర్తన కారణంగా.. లాంచ్‌కి కొన్ని గంటల ముందు కౌంట్‌డౌన్‌ని నిలిపివేశారు.
ఈ అట్లాస్ వీ రాకెట్‌ని.. బోయింగ్-లోక్‌హీడ్ మార్టిన్ జాయింట్ వెంచర్ అయిన యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రూపొందించింది. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత.. కాప్సూల్లోని సిబ్బంది.. మేన్యువల్‌గా ఆపరేట్ చేసి, దీని శక్తిసామర్థ్యాలను లెక్కిస్తారు.
మరి ఈ లాంచ్ మళ్లీ ఎప్పుడు ఉంటుంది? అనేది బోయింగ్ ఇంకా చెప్పలేదు. కానీ బ్యాకప్ డేట్లు.. మే 7, మే10, మే11గా ఉన్నాయి.
మానవసహిత రాకెట్ లాంచ్ కోసం చాలా సంవత్సరాలుగా బోయింగ్ తీవ్రంగా కృషి చేస్తూ వచ్చింది. సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు ఈ మిషన్ కోసం ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కి వెళ్లి, తిరిగి వెనక్కి రావడం.. ఈ మిషన్‌లో భాగం.
లాంచ్‌కి రెడీ అయిన సునీత విలియమ్స్, బుచ్‌లు.. సీట్లల్లో కూర్చుని లిఫ్ట్ ఆఫ్‌కు సిద్ధమయ్యారు. కానీ మిషన్‌ని రద్దు చేయాల్సి వచ్చింది.
“ఇవాల్టి లాంచ్‌ని నిలిపివేస్తున్నాము. మేము ముందు చెప్పినట్టు.. మా మొదటి ప్రాధాన్యత భద్రత. రెడీగా ఉన్నప్పుడే వెళతాము,” అని నాసా చీఫ్ బిల్ నెల్సన్ తెలిపారు.
సేఫ్టీ విషయంలో బోయింగ్ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఇప్పుడు స్టార్‌లైనర్ లాంచ్ రద్దు అవ్వడం.. కమర్షియల్ ఏవియేషన్ విభాగంపై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది.
నాసాపైనా దీని ప్రభావం ఉండొచ్చు! వ్యోమగాములను ఐఎస్ఎస్కి తీసుకెళ్లేందుకు రెండో కమర్షియల్ పార్ట్నర్ కోసం చూస్తోంది నాసా. కానీ బోయింగ్ మిషన్‌కు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవూతూనే వచ్చాయి.
2020లో తన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌తో వ్యోమగాములను ఐఎస్ఎస్కి పంపించారు ఎలాన్ మస్క్. ఫలితంగా.. ఈ విషయంపై రష్యా మీద ఆధారపడే అవసరం తగ్గింది. చివరికి.. స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ రద్దు అయ్యింది.
-
Business8 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career8 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News8 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business8 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business9 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International9 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh8 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana9 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Railways8 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National8 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh8 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political8 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
National9 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National8 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Business9 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
International8 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Weather8 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Education8 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh8 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh8 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh8 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Business9 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Education12 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
Andhrapradesh8 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh12 months ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం