Connect with us

Space

భూమిని తాకిన సౌర తుపాను- ఆకాశంలో అనేక రంగులు- శాటిలైట్​, పవర్​ గ్రిడ్​కు అంతరాయం! – Solar Storm 2024

Published

on

Solar Storm 2024 : రెండు దశాబ్దాలలో చూడని శక్తిమంతమైన సౌరతుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది. ఫలితంగా భారత్‌లోని లద్దాఖ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకాశంలో అరోరాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల కొన్నిచోట్ల విద్యుత్‌ గ్రిడ్లకు, కమ్యూనికేషన్‌, ఉపగ్రహ పొజిషనింగ్‌ వ్యవస్థల్లో స్వల్ప అవరోధాలు ఏర్పడ్డాయి. కానీ, పెద్ద ఇబ్బందులేమీ తలెత్తలేదు. ఆదివారం కూడా ఇవి కొనసాగుతాయని అమెరికాలోని నేషనల్‌ ఓషనిక్‌ అండ్‌ అట్మాస్పియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌వోఏఏ) పేర్కొంది.

నాసా విడుదల చేసిన ఫోటో (APTN)

రంగు రంగుల్లో ఆకాశం
ఉత్తర ఐరోపా నుంచి ఆస్ట్రేలియా వ‌ర‌కు ఆకాశం రంగు రంగుల్లో ద‌ర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైర‌ల్ అవుతున్నాయి. నార్తర్న్‌ లైట్స్‌ను చూసేందుకు జ‌నం ఎగ‌బ‌డ్డారు. ఆ లైట్స్ కంటికి నేరుగా క‌నిపించిన‌ట్లు బ్రిట‌న్‌లో స్థానికులు చెప్పారు. టాస్మానియాలో మాత్రం శనివారం తెల్లవారుజామున నాలుగు గంట‌ల‌కే ఆకాశంలో ఆరోరాలు ద‌ర్శనమిచ్చాయి. లద్దాఖ్‌లోని హాన్లే డార్క్‌ స్కై రిజర్వు ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆకాశం అరుణ వర్ణపు శోభను సంతరించుకుంది.

సౌర తుపాను వల్ల ఏర్పడ్డ అరోరాలు (APTN)

తాజా సౌర తుపానుకు సౌరగోళంలోని ఏఆర్‌13664 అనే ప్రాంతంలో ఏర్పడ్డ ఒక సౌరమచ్చ కేంద్రంగా ఉంది. సౌర తుఫాన్ వ‌ల్ల అయ‌స్కాంత క్షేత్రంలో మార్పులు సంభ‌వించే అవ‌కాశాలు ఉంటాయ‌ని, అందుకే శాటిలైట్ ఆప‌రేట‌ర్లు, ఎయిర్‌లైన్స్‌, ప‌వ‌ర్ గ్రిడ్ సంస్థలు అప్రమత్తంగా ఉండాల‌ని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. క‌రోనాల్ మాస్ ఎజెక్సన్స్‌ సూర్యుడి నుంచి వెలుబ‌డ్డన‌ట్లు నేష‌న‌ల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పియ‌రిక్ అడ్మినిస్ట్రేష‌న్ అంచ‌నా వేసింది. అయితే సౌర తుఫాన్ తీవ్రంగా ఉండటం వల్ల ఎక్స్‌ట్రీమ్ జియోమాగ్నిక్ స్టార్మ్‌గా అప్‌గ్రేడ్ చేశారు. రానున్న రోజుల్లో మ‌రిన్ని క‌రోనాల్ మాస్ ఎజెక్సన్స్‌ భూమిని తాకే అవ‌కాశాలు ఉన్నట్లు హెచ్చరించారు.

అరోరాలు (APTN)

వ్యోమగాములు సేఫ్
మరోవైపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఏడుగురు వ్యోమగాములకు ఈ సౌర తుపాను వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లలేదని నాసా తెలిపింది. రేడియేషన్​ స్థాయిలు పెరగడం ఆందోళ కలిగించే విషయమేనని, అవసరమైతే సిబ్బందిని స్టేషన్​లోని సురక్షిత భాగానికి తరలిస్తామని పేర్కొంది.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

International

అంతరిక్ష కేంద్రంలో సునీత డ్యాన్స్‌- హగ్​ చేసుకుని ఫుల్ ఖుషీ- వీడియో చూశారా? – Sunita Williams Space Trip

Published

on

Sunita Williams Space Video : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు సైతం ప్రయాణించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక గురువారం విజయవంతంగా ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైంది. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం గంటకొట్టి వారిని ఆహ్వానించారు.

సునీత డ్యాన్స్ సూపర్!
ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న సునీత డ్యాన్స్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆలింగనం చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తపర్చారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్‌ స్పేస్‌ తన ఎక్స్‌ ఖాతాలో పంచుకోగా ప్రస్తుతం అది వైరలవుతోంది. సునీత చేసిన డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఐఎస్‌ఎస్‌లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు. వారిని కలిసిన సందర్భంగా తాను ఆ విధంగా వేడుక చేసుకున్నానని తెలిపారు.


గంట ఆలస్యమైనప్పటికీ!
అయితే బోయింగ్‌ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇది తొలి మానవసహిత యాత్ర. అంతకుముందు హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్‌-కంట్రోల్‌ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కాగలిగింది. ఐఎస్‌ఎస్‌కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్‌మోర్‌లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలో కూడా ఈ క్యాప్సూల్‌ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్‌ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని చెప్పారు.

గణేశుడి విగ్రహాన్ని!
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. ఆమె ఒక మారథాన్‌ రన్నర్‌. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్‌ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Space

సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా- ఈసారి ఏమైందంటే?

Published

on

Sunita Williams Space Tour : బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక ప్రయోగం మరోసారి వాయిదాపడింది. ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం కావాల్సింది. ప్రయోగానికి సరిగ్గా 3 నిమిషాల 50 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ను కంప్యూటర్‌ వ్యవస్థ శనివారం నిలిపివేసింది. దీనికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. డేటాను విశ్లేషిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రయోగం ఆదివారం జరిగే అవకాశం ఉంది. గత నెల 6న ఈ వ్యోమనౌక ప్రయోగానికి తొలి ప్రయత్నం జరిగింది. అయితే లీకేజీల సమస్య కారణంగా అది వాయిదా పడింది. నిజానికి ఈ యాత్ర ఎన్నో ఏళ్ల కిందట జరగాల్సింది. సాంకేతిక సమస్యల కారణంగా అది వాయిదా పడుతూ వస్తోంది.

Continue Reading

International

Sunita Williams space mission : చివరి నిమిషంలో.. సునీత విలియమ్స్ 3వ​ స్పేస్​ మిషన్​ రద్దు!

Published

on

Boeing Starliner launch : భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్​ 3వ స్పేస్​ మిషన్​.. చివరి నిమిషంలో రద్దు అయ్యింది. మరో వ్యోమగామితో కలిసి ఆమె ప్రయాణించాల్సిన బోయింగ్​ కంపెనీకి చెందిన స్టార్​లైనర్​ రాకెట్​లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మిషన్​ని నిలిపివేశారు!

బోయింగ్​ స్టార్​లైనర్​కు అడుగడుగునా అడ్డంకులు..
తొలి మానవసహిత స్టార్​లైనర్​​ మిషన్​ని బోయింగ్​ కంపెనీ.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కానీ ఈ మిషన్​కి అడుగడుగునా అడ్డంకులు ఎదరవుతూ వచ్చాయి. ఫలితంగా.. రాకెట్​ లాంచ్​ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక అంతా సిద్ధం అనుకున్న సమయంలో.. సునీత విలియమ్స్​ 3వ స్పేస్​ మిషన్​ రద్దు అయ్యింది. అట్లాస్​ వీ రాకెట్​ పైభాగంలోని వాల్వ్​లో అనుమనాస్పద ప్రవర్తన కారణంగా.. లాంచ్​కి కొన్ని గంటల ముందు కౌంట్​డౌన్​ని నిలిపివేశారు.

ఈ అట్లాస్​ వీ రాకెట్​ని.. బోయింగ్​-లోక్​హీడ్​ మార్టిన్​ జాయింట్​ వెంచర్​ అయిన యునైటెడ్​ లాంచ్​ అలయెన్స్​ రూపొందించింది. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత.. కాప్సూల్​లోని సిబ్బంది.. మేన్యువల్​గా ఆపరేట్​ చేసి, దీని శక్తిసామర్థ్యాలను లెక్కిస్తారు.

మరి ఈ లాంచ్​ మళ్లీ ఎప్పుడు ఉంటుంది? అనేది బోయింగ్​ ఇంకా చెప్పలేదు. కానీ బ్యాకప్​ డేట్​లు.. మే 7, మే10, మే11గా ఉన్నాయి.

మానవసహిత రాకెట్​ లాంచ్​ కోసం చాలా సంవత్సరాలుగా బోయింగ్​ తీవ్రంగా కృషి చేస్తూ వచ్చింది. సునీత విలియమ్స్​, బుచ్​ విల్​మోర్​లు ఈ మిషన్​ కోసం ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్పేస్​ స్టేషన్​కి వెళ్లి, తిరిగి వెనక్కి రావడం.. ఈ మిషన్​లో భాగం.

Advertisement

లాంచ్​కి రెడీ అయిన సునీత విలియమ్స్​, బుచ్​లు.. సీట్లల్లో కూర్చుని లిఫ్ట్​ ఆఫ్​కు సిద్ధమయ్యారు. కానీ మిషన్​ని రద్దు చేయాల్సి వచ్చింది.

“ఇవాల్టి లాంచ్​ని నిలిపివేస్తున్నాము. మేము ముందు చెప్పినట్టు.. మా మొదటి ప్రాధాన్యత భద్రత. రెడీగా ఉన్నప్పుడే వెళతాము,” అని నాసా చీఫ్​ బిల్​ నెల్సన్​ తెలిపారు.

సేఫ్టీ విషయంలో బోయింగ్​ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఇప్పుడు స్టార్​లైనర్​ లాంచ్​ రద్దు అవ్వడం.. కమర్షియల్​ ఏవియేషన్​ విభాగంపై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది.

నాసాపైనా దీని ప్రభావం ఉండొచ్చు! వ్యోమగాములను ఐఎస్​ఎస్​కి తీసుకెళ్లేందుకు రెండో కమర్షియల్​ పార్ట్​నర్​ కోసం చూస్తోంది నాసా. కానీ బోయింగ్​ మిషన్​కు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవూతూనే వచ్చాయి.

2020లో తన స్పేస్​ఎక్స్​ డ్రాగన్​ క్యాప్సూల్​తో వ్యోమగాములను ఐఎస్​ఎస్​కి పంపించారు ఎలాన్​ మస్క్​. ఫలితంగా.. ఈ విషయంపై రష్యా మీద ఆధారపడే అవసరం తగ్గింది. చివరికి.. స్పేస్​ షటిల్​ ప్రోగ్రామ్​ రద్దు అయ్యింది.

Advertisement
Continue Reading
International6 hours ago

‘మౌస్ జిగ్లింగ్‌’కు పాల్పడుతున్న ఉద్యోగులను తొలగించిన దిగ్గజ సంస్థ.. ‘మౌస్ జిగ్లింగ్‌’ అంటే ఏంటో తెలుసా?

National6 hours ago

నీట్ అవకతవకలపై సీబీఐ విచారణ.. ఎఫ్ఐఆర్ నమోదు

National6 hours ago

నకిలీ కరెన్సీతో గిరిజనులకు మావోల మోసం- పెద్దఎత్తున డబ్బులు స్వాధీనం

National6 hours ago

కల్తీసారా బాధితులు కేర్​ లెస్​- లిమిట్​కు మించి తాగడం వల్లే!: కమల్ హాసన్​

National6 hours ago

సోమవారం నుంచే లోక్‌సభ తొలి సెషన్​- మోదీ ప్రమాణస్వీకారం అప్పుడే- తెలుగు ఎంపీలు ఎప్పుడంటే? – 18th Lok Sabha First Session

Andhrapradesh6 hours ago

సామాన్యులకు కూర’గాయాలు’ – vegetables prices in AP

National7 hours ago

Reservation Cancel: 65 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు.

Andhrapradesh7 hours ago

Andhra Pradesh: మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కీలక ప్రకటన

Political7 hours ago

బీఎస్పీ ఛీఫ్ కీలక నిర్ణయం.. వారసుడిని ప్రకటించిన మాయావతి

Cricket7 hours ago

IND vs AUS Pitch Report: డారెన్ సామీ స్టేడియంలో భారత్, ఆసీస్ మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ చూస్తే పరేషానే.. ఎందుకో తెలుసా?

Technology7 hours ago

విజయవంతమైన పుష్పక్ విమానం

Railway22 hours ago

వృద్ధులు గర్భిణులకు గుడ్ …న్యూస్ రైల్వే ప్రయాణాల్లో వెసలు బాటు

National1 day ago

కేంద్రం సంచలన నిర్ణయం ….సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.

Andhrapradesh1 day ago

అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి

National2 days ago

కేజ్రీవాల్​కు మళ్లీ షాక్​- బెయిల్​పై దిల్లీ హైకోర్టు స్టే – Delhi HC stays Arvind Kejriwal Bail

International2 days ago

చైనాలో చెట్లకు పక్షుల్లా వేలాడుతున్న మనుషులు..

International2 days ago

Overseas Indians: డాలర్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తేసిన ఎన్నారైలు – ఒక్క నెలలో రూ.9 వేల కోట్లు డిపాజిట్‌

Andhrapradesh3 days ago

ఋషికొండ నాకే ఇవ్వండి చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చిన సుకేష్

Cinema3 days ago

Anupam Kher : బాలీవుడ్ స్టార్ న‌టుడు ఆఫీసులో దొంగ‌లు ప‌డ్డారు.. వీడియో షేర్ చేసిన అనుప‌మ్ ఖేర్

National3 days ago

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

National3 days ago

Infosys Offered: ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ బంపర్‌ ఆఫర్‌.. ఆ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు.!

National3 days ago

మంచుకొండల్లో, యుద్ధనౌకలపై సైనికుల ఆసనాలు- కాశ్మీరంలో మోదీ- దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం – international yoga day

National3 days ago

‘నీట్​ పేపర్​ లీకేజీ నిజమే- పరీక్ష ముందురోజే విద్యార్థుల చేతికి ప్రశ్నాపత్రాలు- రూ.30లక్షలకు బేరం’ – neet ug 2024 controversy

Andhrapradesh3 days ago

అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజు నుండి

Andhrapradesh3 days ago

Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం

Andhrapradesh4 days ago

కొత్త సలహాదారుల నియామకం… ఏ బి తో సహా

Andhrapradesh4 days ago

రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP

Weather4 days ago

జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…

Technology4 days ago

WhatsApp AR Features : వాట్సాప్‌లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఏఆర్ ఫీచర్లు.. వీడియో, ఆడియో కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు..!

Andhrapradesh4 days ago

బాధ్యతలు స్వీకరించిన మంత్రులు- తొలిసంతకాలు వాటిపైనే! – AP MINISTERS

Business4 weeks ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career4 weeks ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business4 weeks ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

Business4 weeks ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

News4 weeks ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

National2 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Education2 weeks ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

Crime News2 weeks ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

National2 weeks ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

National2 weeks ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh2 weeks ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National4 weeks ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh2 weeks ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Andhrapradesh2 weeks ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

National2 weeks ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Telangana4 weeks ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh2 weeks ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Andhrapradesh2 weeks ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Spiritual2 weeks ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

Political2 weeks ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Political7 days ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Spiritual2 weeks ago

Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

Business4 weeks ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Andhrapradesh2 weeks ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

National2 weeks ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh2 weeks ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

Andhrapradesh4 weeks ago

అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara

Spiritual4 weeks ago

చార్ ధామ్ యాత్ర‌కు పొటెత్తిన భక్తులు.. గ‌త ఏడాదికంటే ఎక్కువే!

News2 weeks ago

Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Andhrapradesh2 weeks ago

AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!

Trending