National

Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

Published

on

Zomato Delivery Boy : అదో మురికివాడ.. అందరూ ముంబై స్లమ్ ఏరియాగా పిలుస్తారు.. ఆ ప్రాంతంలో కాసేపు నిలబడటమే కష్టం.. అలాంటిది అక్కడే నివాసముంటున్న వారి పరిస్థితి ఇంకెంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం.. వారికి అదే నివాసం.. మనుగడ కోసం ఏదో ఒక పని చేసుకుంటూనే పోరాడుతుంటారు.

అలాంటి ముంబై మురికివాడలో ఓ యువకుడు తన మనుగడ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. ఒకవైపు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ వచ్చిన జీతంతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తాను ఉండేది చాలా చిన్న గది.. ఆ గదికి నెలకు రూ. 500 అద్దె చెల్లిస్తున్నాడు. ఇదంతా తన ఇన్‌స్టా‌‌గ్రామ్ అకౌంట్‌‌లో వీడియో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఇంతకీ డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ గురించి అతడి మాటల్లోనే తెలుసుకుందాం..

ముంబై స్లమ్ ఏరియాలో తన జీవిత కష్టాల గురించి జొమాటో డెలివరీ బాయ్ వీడియో ద్వారా తెలిపాడు. ‘రూమ్ టూర్’ పేరుతో చేసిన ఆ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ నేమ్ ‘qb_07’ పేరుతో చేసిన పోస్ట్‌‌కు “ముంబయిలో కష్టపడుతున్న కళాకారుడు” అనే క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. అది చూసిన తన ఫాలోవర్లు, ఫ్యాన్స్ తమదైన శైలీలో స్పందిస్తున్నారు. మొత్తం రెండు వీడియోలను పోస్టు చేసిన డెలివరీ బాయ్.. తాను నెలకు రూ. 500 అద్దెగా చెల్లిస్తానని చెప్పాడు. తాను ఉండే చిన్న గదికి ఇరుకైన సందులో నుంచి వెళ్లాడు.

“ఈ ప్రదేశంలో నడుస్తున్నప్పుడు నేను ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది” అని చెప్పాడు. రెండు నిమిషాల తర్వాత.. లేన్ చివరకి వచ్చి తన చిన్న గదికి వెళ్లేఇనుప మెట్లపైకి ఎక్కాడు. ముంబైలో ఇంటిని వెతికిపెట్టిన తన స్నేహితుడు సోనుని కూడా ఫాలోవర్లకు పరిచయం చేశాడు. చుట్టుపక్కల వస్తువులతో పాటు తన గది పరిస్థితిని కూడా వీడియోలో చూపించాడు. అక్కడే సోనూతో పాటు, బిర్యానీ తిన్నాడు. ‘‘నా ఆరోగ్యం సరిగా లేనప్పుడు.. నా కుటుంబం నా కోసం చాలా ఖర్చు చేసింది. నేను వాళ్లను డబ్బు అడగలేను” అని డెలివరీ బాయ్ ఆవేదనను వెలిబుచ్చాడు.

అందుకే పిల్లిని పెంచుతున్నాను : డెలివరీ బాయ్
ఈ నెల 23న మరో వీడియోను పోస్టు చేయగా.. తన గదిలో స్థలం లేక తాత్కాలిక బాత్రూమ్ నిర్మించుకున్నానని చెప్పుకొచ్చాడు. “మరుగుదొడ్డి బయట ఉంది. ఈ గదిలో వెంటిలేషన్ కూడా లేదు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుంటాను’ అని తన రోజువారీ కష్టాలను చెప్పుకొచ్చాడు జొమాటో డెలివరీ ఏజెంట్.

Advertisement

ఇలాంటి ఇబ్బందుల మధ్య తాను ఎలా జీవిస్తున్నాడో తన ఫాలోవర్లకు చెబుతూనే ఒక పిల్లి పిల్లను కూడా పెంచుకుంటున్నట్టుగా తెలిపాడు. “అలాంటి ప్రదేశంలో పిల్లి జీవించడం కూడా కష్టమే. కానీ, అది బయట మనుగడ సాగించదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అందుకే నేను పెంచుకోవాలని నిర్ణయించుకున్నాను, ”అని తెలిపాడు.


ఈ వీడియోకు దాదాపు 5 మిలియన్ల వ్యూస్ రావడంతో బాగా వైరల్ అయింది. సోషల్ మీడియా యూజర్లు ఇంత చిన్న వయస్సులోనే ఇన్ని కష్టాలా? అంటూ అతడిని అభినందిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పిల్లి పిల్లను చూసుకున్నందుకు అతనితో పాటు అతని స్నేహితులను పలువురు ప్రశంసించారు.

“పిల్లి పిల్లని కూడా చూసుకుంటున్నారు. ప్రేమకు లోటు లేదు” అని ఒక యూజర్ కామెంట్ పెట్టగా.. “రాక్‌స్టార్ చేయడానికి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి ఆల్ ది వెరీ బెస్ట్.” మరో యూజర్ కామెంట్ పెట్టాడు. అంతేకాదు.. ఈ డెలివరీ బాయ్ పాటలు కూడా బాగా పాడగలడు. తన మధురమైన స్వరానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన వీడియోల్లో ఎక్కువగా పాపులర్ హిందీ పాటలను పాడుతూ తన ఫాలోవర్లను అలరిస్తుంటాడు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version