International
ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోవర్స్- ప్రపంచ నేతల్లో మోదీయే టాప్!
PM Modi followers on X : ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఫీట్ సాధించారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ఆయన్ను అనుసరిస్తున్న వారి సంఖ్య 100 మిలియన్ల (10 కోట్లు) దాటింది. గతంలో తనను ఫాలోవర్స్ విషయంలో కొత్త రికార్డు నెలకొల్పిన మోదీ, ఇప్పుడు ఆ రికార్డును ఆయనే బద్దలుగొట్టారు. దీనిపై ప్రధాని మోదీహర్షం వ్యక్తం చేశారు. ఎక్స్‌లో ఉండటం, ఈ సామాజిక మాధ్యమం వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు తదితర వాటికి ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని పోస్ట్ చేశారు. 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ట్విటర్ వినియోగించడం ప్రారంభించారు. అనతికాలంలోనే 2010లో ఆయన లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికీ ఈ స్థాయి ఆదరణ లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఎక్స్‌లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.