Hashtag

ప్రపంచంలో అత్యంత వయసున్న వ్యక్తి మార్సెలినో అబాద్..! ఏ దేశం? ఎన్ని సంవత్సరాలో తెలుసా..

Published

on

Worlds Oldest Person : ప్రపంచంలోనే అత్యంత వయస్సు కలిగిన వ్యక్తి తమ దేశంలో ఉన్నాడని, అతని వయస్సు 124 సంవత్సరాలు అని పెరూ దేశ ప్రభుత్వం పేర్కొంది. పెరూలోని హువానుకోలోని సెంట్రల్ పెరువియన్ ప్రాంతానికి చెందిన మార్సెలినో అబాద్ అనే వ్యక్తికి 124 సంవత్సరాలు.. అతను 1990లో జన్మించినట్లు, అబాద్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి తాము సహాయం చేస్తున్నామని పెరువియన్ అధికారులు చెప్పారు. పెరూ ప్రభుత్వం వాదన రుజువైతే ప్రపంచంలోనే అత్యంత వయస్సు కలిగిన వ్యక్తిగా అబాద్ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు.

124 సంవత్సరాలు వచ్చినా మార్సెలినో అబాద్ ఆరోగ్యంగా ఉన్నాడు. అతను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రశాంతమైన జీవనం. హుహనుకో ప్రాంతంలో పచ్చదనం, జంతుజాలం మధ్య ప్రశాంతమైన జీవనవిధానమే మార్సెలినో అబద్ ఆరోగ్య రహస్యం. అంతేకాదు.. అతను తన డైట్ లో మంచి పండ్లు ఉండేలా చూసుకుంటాడు. గొర్రె మాంసం ఎక్కువగా తింటాడు. గత నెల ఏప్రిల్ 5న అబద్ 124 సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. సీనియర్స్ వెల్ఫేర్ హోంలో ఉంటున్న అతను అక్కడే తన 124వ బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు. చాగ్లాలోని ఓ చిన్న పట్టణంలో అబద్ జన్మించాడు. 2019లో పెరూ ప్రభుత్వం అతన్ని గుర్తించి.. ప్రభుత్వ ఐడీ కార్డుతో పాటు, పెన్షన్ మంజూరు చేస్తుంది.

114ఏళ్ల వయస్సు కలిగిన వెనిజులాకు చెందిన ఓ వ్యక్తి మరణానంతరం ప్రపంచంలోని అత్యంత వయస్సు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కారు. ప్రస్తుతం అత్యంత ఎక్కువ కాలం జీవించిన వృద్ధుడుగా.. ఇంగ్లండ్ నివాసి జాన్ ఆల్ఫ్రెడ్ గిన్నిస్‌ రికార్డుల్లో నిలిచాడు. అతని వయస్సు 111ఏళ్ల. అతను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ వయస్సు 117ఏళ్లు. ఆమె పేరు మరియా బ్రన్యాస్ మోరేరా. స్పెయిన్ లో ఆమె నివసిస్తుంది. అయితే, ఇప్పుడు పెరూకి చెందిన అబాద్ అనే వృద్ధుడే వాళ్లందరి కంటే ప్రపంచంలోనే అత్యంత వయస్సు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version