Technology
Whatsapp Calling Features : వాట్పాప్ యూజర్లకు పండుగే.. 3 మేజర్ కాలింగ్ ఫీచర్లు.. 32 మందితో వీడియో కాల్స్, ఆడియోతో స్ర్కీన్ సేరింగ్..!
Whatsapp Calling Features : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ వినియోగదారుల కోసం సరికొత్త కాలింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. గతంలో వాట్సాప్ అనేక కాలింగ్ ఫీచర్లను తీసుకొచ్చింది. కానీ, ఇప్పుడు ఏకంగా 3 మేజర్ కాలింగ్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.
గత 2015లో వాట్సాప్ కాలింగ్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి యూజర్ కమ్యూనికేట్ చేయడం అనేది గేమ్-ఛేంజర్‌గా మారింది. ఏళ్లతరబడి గ్రూప్ కాల్‌లు, వీడియో కాల్స్, మల్టీ ప్లాట్‌ఫారమ్‌లలో సపోర్టుతో డెవలప్ చేసింది. ఇప్పుడు, వాట్సాప్ మీ అన్ని డివైజ్‌ల్లో కాలింగ్‌ను మరింత ఆకర్షణీయంగా ఉండేలా సరికొత్త అప్‌డేట్స్ విడుదల చేస్తోంది.
ఆడియోతో స్క్రీన్ షేరింగ్ :
వాట్సాప్‌లో కాలింగ్ సమయంలో ఆడియోతో స్క్రీన్ షేరింగ్ అనేది అద్భుతమైన కొత్త ఫీచర్లలో ఒకటి.. మీరు ఆడియోతో పాటు వీడియోను చూడాలనుకున్నప్పుడు లేదా కాల్ చేస్తున్నప్పుడు మీ స్క్రీన్‌పై ఏదైనా షేరింగ్ చేయాలనుకుంటే ఇదే సరైన ఆప్షన్. ఇంతకుముందు మీ స్క్రీన్‌ను ఇతరులతో షేర్ చేయవచ్చు. కానీ, ఇప్పుడు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఆడియోను వినవచ్చు. తద్వారా గ్రూపు కాల్స్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా మార్చవచ్చు.
32మందితో వీడియో కాల్స్ :
వాట్సాప్ వీడియో కాల్స్ గణనీయమైన అప్‌గ్రేడ్స్ అందుకుంటుంది. మీరు వీడియో కాల్‌లో పాల్గొనే వారి సంఖ్యను వాట్సాప్ 32కి విస్తరిస్తోంది. అంటే.. మీరు ఇప్పుడు డెస్క్‌టాప్ లేదా మొబైల్ ఫోన్‌తో సంబంధం లేకుండా ఒకే కాల్‌లో ఎక్కువ మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులను చేర్చుకోవచ్చు. వర్చువల్ మీటింగ్స్, మీటింగ్ లేదా ఆన్‌లైన్ క్లాసులకు కూడా అద్భుతమైన ఫీచర్ అని చెప్పవచ్చు.
స్పీకర్ స్పాట్‌లైట్ :
గ్రూపు కాల్ సమయంలో ఎవరు మాట్లాడుతున్నారో ట్రాక్ చేయొచ్చు. కానీ, ఇకపై కాదు. కొత్త స్పీకర్ స్పాట్‌లైట్ ఫీచర్‌తో మాట్లాడుతున్న వ్యక్తి ఆటోమేటిక్‌గా హైలైట్ అవుతారు. మీ స్క్రీన్‌పై మొదట కనిపిస్తాడు. తద్వారా కాన్వర్జేషన్ మరింత సులభంగా ఉంటుంది.
మెరుగైన ఆడియో, వీడియో క్వాలిటీ ఫీచర్లు :
వాట్సాప్ ఎల్లప్పుడూ హైక్వాలిటీ కాల్స్‌కు ప్రాధాన్యతనిస్తుంది. (MLow codec) కాల్ ఫీచర్ ఇటీవలే ప్రవేశపెట్టింది. మొబైల్ యూజర్లు మెరుగైన నాయిస్, ఎకో క్యాన్సిలేషన్ పొందవచ్చు. అంటే.. మీ కాల్స్ ధ్వని ఎక్కువగా ఉండే వాతావరణంలో కూడా స్పష్టంగా వినిపిస్తాయి.
అంతేకాదు.. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే.. వీడియో కాల్స్ హై రిజల్యూషన్ కూడా పొందవచ్చు. మీరు పాత ఫోన్ ఉన్నప్పటికీ లేదా తక్కువ నెట్‌వర్క్ కనెక్టివిటీని కలిగి ఉన్నప్పటికీ మొత్తం ఆడియో క్వాలటీ చాలా స్పష్టంగా ఉంటుంది. వాట్సాప్ కాలింగ్ ఫీచర్లను నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తుంటుంది.
మీ ఇంటి నుంచి ప్రైవేట్ కాల్ చేస్తున్నా లేదా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి స్నేహితులతో చాట్ చేస్తున్నా వాట్సాప్ బెస్ట్ కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్‌లు, కాలింగ్ ఫీచర్‌లపై మరిన్ని అప్‌గ్రేడ్స్ అందిస్తోంది. ఇతరులతో కనెక్ట్ అవ్వడం చాలా సులభం. ఆడియోతో స్క్రీన్ షేరింగ్ నుంచి వీడియో కాల్‌లలో ఎక్కువ మంది పాల్గొనేవారి వరకు మెరుగైన ఆడియో క్వాలిటీతో పాటు మీరు ఎక్కడ ఉన్నా బెస్ట్ క్వాలిటీ కాల్స్ చేసుకోవచ్చు.