Andhrapradesh

శ్రీశైలక్షేత్రంలో గాలి వాన బీభత్సం.. దర్శనానికి అంతరాయం.. పరుగులు తీసిన భక్తులు..

Published

on

నంద్యాల జిల్లా శ్రీశైలంలో అర్ధగంట పాటు వర్షం దంచికొట్టింది కుంభవృష్టి కురిసింది. శ్రీశైలం, సున్నిపెంటల, లింగలగట్టులో ఎడతెరుపు లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి క్షేత్రంలో ప్రధాన విధులన్ని జలమయమయ్యాయి. ఉదయం నుండి ఉక్కపోతగా ఉన్న మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మొబ్బులతో కూడిన భారీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా శ్రీస్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులుపడ్డారు. దర్శనానికి వెళ్తూ అకాల వర్షం కురవడంతో రేకుల షెడ్స్ కిందకు పరుగులు తీశారు. మరికొందరు భక్తులు వసతి గృహాలకు పరిమితమయ్యారు. ఇలా దొరికిన చోటు వర్షంలో తడవకుండా తలదాచుకున్నారు. ఎండ ఉక్కపోతకు గురైన స్థానికులు, భక్తులు భారీ వర్షం పడటంతో కొద్దిపాటి ఉపశమనం పొందారు. ఉరుములు, మెరుపులు ఈదురుగాలితో వర్షం మొదలవడంతో విద్యుత్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కాసేపు శ్రీశైలం క్షేత్రంలో విద్యుత్‎ను సరఫరాను నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version