Hyderabad

కడిగిన ముత్యంలా బయటకు వస్తా: కవిత

Published

on

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో జడ్జి కావేరి బవేజా ముందు కవితను హాజరుపర్చారు. మరో 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిశాక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాసేపట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది.

రౌస్ అవెన్యూ కోర్టులోనే కవిత భర్త అనిల్, బంధువులు ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కోరారు కవిత తరఫు న్యాయవాది. ఒక అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి. కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరారు.

కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. వర్చువల్ మోడ్ లో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది.

తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు.. కానీ..
కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మీడియాతో కవిత అన్నారు. ఇది మనీ లాండరింగ్ కాదని పొలిటికల్ లాండరింగ్ కేసని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరారని అన్నారు. రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. మూడో నిందితుడు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్పారు. తాను అప్రూవర్ గా మారడం లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version