Telangana

Warangal 1000 Pillar Temple : సిద్ధమైన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం – 17 ఏళ్ల తర్వాత అందుబాటులోకి…

Published

on

1000 Pillar Temple Kalyana Mandapam : 17 ఏళ్ల తర్వాత వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది.1000 Pillar Temple Kalyana Mandapam: కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీక వరంగల్​ నగరంలోని వేయి స్తంభాల గుడి(Warangal 1000 Pillar Temple). డెవలప్​ మెంట్​ పేరుతో 2006లో ఆలయంలోని కల్యాణ మండపాన్ని తొలగించి, పునరుద్ధరించే పనులు చేపట్టారు. కానీ ప్రభుత్వాలు మారినా అనుకున్న టైంలో వర్క్స్​ కంప్లీట్​ కాలేదు. దాదాపు 17 ఏళ్ల పాటు పనులు కొనసాగగా.. చివరకు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి చొరవతో ఎట్టకేలకు ఓపెనింగ్​ కు సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం వేయి స్తంభాల గుడిలో పునరుద్ధరించిన కల్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి చేతులమీదుగానే పున: ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వెయ్యేళ్లు చెక్కుచెదరలే
ఓరుగల్లు(Warangal History) నగరాన్ని కాకతీయులు పాలించిన కాలంలో ఒకటో రుద్రుడు కీ.శ.1163లో వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1,400 మీటర్ల వైశాల్యంలో, శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలందుకునే విధంగా ఈ ఆలయాన్ని రూపొందించారు. శిలలపై సప్తస్వరాలు లిఖించడంతో పాటు టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లోనే టన్నుల కొద్దీ బరువుండే శిలలతో ఆలయానికి జీవం పోశారు. డంగు సున్నం, కరక్కాయపాడి, బెల్లం, ఇటుక పొడి తదితర మిశ్రమాలతో మొత్తం వెయ్యి స్తంభాలతో వెయ్యేళ్ల వరకు చెక్కుచెదరకుండా ఆలయాన్ని నిర్మించారు. ఇదిలాఉంటే వరంగల్ నేపథ్యంలో వేయి స్తంభాల గుడిని(Thousand Pillar Temple) చూపిస్తూ వర్షం సినిమాను తెరకెక్కించగా.. అది కాస్త సూపర్​ హిట్​ అయ్యింది. ఆ తరువాత వర్షం డబ్బింగ్​ వర్షన్స్​ తో పాటు 20కి పైగా వేయి స్తంభాల గుడి, అందులో ఉన్న కల్యాణ మండపాన్ని చూపిస్తూ షూటింగ్​ చేసుకుని సక్సెస్ అయ్యాయి.దీంతో వేయి స్తంభాల గుడికి సినిమా యూనిట్స్​ తో పాటూ టూరిస్ట్​ ల రాక కూడా ఎక్కువైంది. ఇదిలాఉంటే పర్యాటకుల తాకిడికి అనుగుణంగా ఆలయాన్ని పునరుద్ధరించే పేరున 2006లో కల్యాణ మండల స్తంభాలను తొలగించారు. వాటిని రీడెవలప్​ చేసి మళ్లీ కల్యాణ మండపాన్ని రూపొందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పుకొచ్చారు.

మహాశివరాత్రి సందర్భంగా ఓపెనింగ్​
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి(Union Kishan Reddy) చేతులమీదుగా శుక్రవారం ఉదయం వేయి స్తంభాల గుడి కల్యాణ మండపాన్ని పున: ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రమే ఆయన వరంగల్ నగరానికి రానున్నారు. గురువారం సాయంత్రం ఆరు గంటలకు వరంగల్​ కోటలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన శుక్రవారం ఉదయం కల్యాణ మండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం శుక్రవారం ఉదయం 10 గంటలకు ములుగు జిల్లాలోని స్కిల్​ డెవలప్​ మెంట్ సెంటర్​ వద్ద సమ్మక్క సారలమ్మ ట్రైబల్​ యూనివర్సిటీ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఆయా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version