Spiritual

Maha Shivaratri 2024 : మహాశివరాత్రికి జాగరణ ఎందుకు చేయాలి?

Published

on

Maha Shivaratri 2024 : మహా శివరాత్రి అనగానే మెుదట గుర్తొచ్చేది జాగరణ. ఆ రోజు రాత్రి అంతా నిద్రపోరు. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి.
మహాశివరాత్రి రోజున మనం రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా జాగరణ చేయాలని చెబుతారు. మహాశివరాత్రి రోజున మాత్రమే మీరు శివుని అద్భుతాలను పూర్తిగా గ్రహించగలరని అంటారు. కోరిన వరాన్ని ఇచ్చే రాత్రి ఈ మహా శివరాత్రి అవుతుంది. ఆ రాత్రి మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి శివుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు.
మనం ఎవరు, మనం ఏమి చేస్తున్నాం, ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా మారాలి అనే ఆలోచనలన్నీ మన మనస్సులో ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. కానీ వాటిని సాధించడంలో మన శారీరక, మానసిక బలం పూర్తి పాత్ర పోషిస్తుంది.

సాధారణంగా మహాశివరాత్రి రోజు సాయంత్రం గుడికి వెళ్లి పూజలు నిర్వహించి ఆ తర్వాత శివుని తలచుకుంటూ శివ మంత్రాలు, శివపురాణాలు పఠిస్తూ రాత్రంతా జాగారం చేస్తారు. రాత్రంతా శివుడికి మేల్కొని పూజిస్తే మనం అనుకున్నది జరుగుతుందని అంటుంటారు. రాత్రంతా మెలకువగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా?
శివుని స్ఫూర్తిని పొందేందుకు ఈ శివరాత్రి సరైన రోజు. మహా శివరాత్రి నాడు, మనం రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని కూర్చుని, మన వెన్నెముకను సరళ రేఖలో ఉంచుతాం. మన శరీరం, మనస్సు శక్తి స్థాయిలు పెరగడం ప్రారంభిస్తాయి. ఈ శక్తి పెరుగుదల ద్వారా మీరు శాంతి, మోక్ష జీవితాన్ని పొందవచ్చు. వెన్నెముక నిటారుగా ఉంచుకుని రాత్రిపూట మేల్కొని శరీర శక్తిని పెంచుకోవాలని అంటారు.

మహాశివరాత్రి సమయంలో గ్రహాల కూటమి కూడా మారుతుంది. మనం నిటారుగా వెన్నెముకతో కూర్చున్నప్పుడు, గ్రహాల అమరిక కుండలినీ శక్తి వలె మన ప్రాణశక్తిని పెంచుతుంది. యోగులు, మునులు చాలా మంది ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి వారు అనుకున్నట్లుగా ముక్తిని పొందారు. ఎన్నో అద్భుతాలు చేయగల రాత్రి ఇది.

చాలా మంది శివరాత్రి అంటే సంవత్సరంలో ఒక రోజు మాత్రమే అని అనుకుంటారు. అలా కాదు.. శివరాత్రి ప్రతి నెలలో ఒక రోజు వస్తుంది. అది అమావాస్య ముందు రోజు అవుతుంది. అమావాస్య కంటే ఈ శివరాత్రి రోజు చీకటిగా ఉంటుంది. సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రిలలో అత్యంత శక్తివంతమైనది మార్చిలో వచ్చే శివరాత్రి. అందుకే మహాశివరాత్రి అంటాం.
సాధారణంగా శివరాత్రిని రాత్రిపూట జరుపుకుంటాం. మనం చీకట్లో ఎందుకు జాగరణ ఉండాలంటే కొన్ని కారణాలు ఉన్నాయి. లోతైన అర్థం దాగి ఉంది. ఈ ప్రపంచం శూన్యం. చీకటి అనేది శాశ్వతమైన వాస్తవం. చీకటిలోనే ఈ ప్రపంచం నిర్మితమైందని మనం అర్థం చేసుకోవాలి.

ఇదంతా నాన్సెన్స్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఆధునిక శాస్త్రీయ పద్ధతులు కూడా విశ్వంలోని అన్ని వస్తువులు శూన్యం నుండి ఉత్పన్నమవుతాయని చూపిస్తున్నాయి. అలాంటి శూన్యాన్ని మనం శివునిగా కూడా పూజిస్తాం. దీన్ని అర్థం చేసుకోవడం వల్ల మన మనస్సు సంతోషంగా ఉంటుంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version