Cricket
ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ లవర్స్ సందడి.. బారులు తీరిన ఫ్యాన్స్
IPL 2024 SRH vs MI: సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ లవర్స్ సందడి నెలకొంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటల నుంచే స్టేడియంలోకి అనుమతిస్తుండడంతో అభిమానులు బారులు తీరారు. దీంతో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. టికెట్లు పరిశీలించిన తర్వాత ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ సజావుగా సాగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టీఎస్ ఆర్టీసీ, మెట్రోరైళ్లు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి.
Crowd has started to gather outside the Stadium in Hyderabad to see the Indian Skipper Rohit Sharma.
– All eyes on Hardik, he is really having a bad time.#RohitSharma #SRHvsMi #SRHvMI #MIvSRH pic.twitter.com/kpW1aimLzZ— CricVipez (@CricVipezAP) March 27, 2024
జోరుగా బ్లాక్ టికెట్ల దందా
ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో జోరుగా బ్లాక్ టికెట్ల దందా నడుస్తోంది. బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్స్ అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కాంప్లెమెంటరీ పాసులను బ్లాక్‌లో అమ్ముతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు HCA నుంచి టిక్కెట్లు పక్కదారి పట్టాయని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తమ తొలి మ్యాచ్‌లో పరాజయాన్ని చవిచూశాయి. ఈరోజు మ్యాచ్‌లో గెలిచి బోణి కొట్టాలని రెండు టీమ్‌లు పట్టుదలతో ఉన్నాయి. ముంబై టీమ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతడి ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.