Business
Twitter No More : ట్విట్టర్ యూఆర్ఎల్ మారిందోచ్.. ఇకపై అధికారికగా ‘ఎక్స్’ వచ్చేసింది.. చెక్ చేశారా?
Twitter No More : ట్విట్టర్ యూఆర్ఎల్ మారింది చూశారా? ఇకపై అధికారికంగా ట్విట్టర్ కాదు. ఆ స్థానంలో X పేరుతో యూఆర్ఎల్ కనిపిస్తుంది. కొన్ని గంటల క్రితమే సంస్థ అధినేత ఎలన్ మస్క్ ఎక్స్ యూఆర్ఎల్ మారిందంటూ ట్వీట్ చేశారు. కేవలం ఎక్స్ వెబ్‌సైట్ మాత్రమే కాదు.. అన్ని కోర్ సిస్టమ్స్ ఇప్పుడు (x.com)లో మారాయని ఎలాన్ మస్క్ ప్రకటించారు.
x dot com
— X (@X) May 17, 2024
ఎక్స్ యూజర్లు ఎవరైనా ట్విట్టర్ (twitter.com) యూఆర్ఎల్‌తో సెర్చ్ చేస్తే.. అది ఇప్పుడు x.comకి రీడైరెక్ట్ అవుతుంది.. కొత్త X లాగిన్ ఇప్పుడు కంపెనీ URLని రీడైరెక్ట్ అవుతుందని తెలిపే మెసేజ్ కూడా డిస్‌ప్లే అవుతుంది. అయితే, ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ చెక్కుచెదరకుండా అలానే ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ట్విట్టర్ నుంచి ‘X’గా మారిందిలా :
2022 తర్వాత మస్క్ ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్లాట్‌ఫారంలో ట్వీట్‌ల పేరును పోస్ట్‌లుగా మార్చారు. అంతేకాదు.. యూజర్లను ట్వీట్ బదులుగా పోస్ట్‌లు అని పిలవాలని ప్రోత్సహించాడు. అప్పుడే ట్విట్టర్ అధికారిక లోగో ‘X’గా మారింది. కంపెనీ రీబ్రాండింగ్, మొబైల్ యాప్, సబ్‌స్క్రిప్షన్ ఆధారిత విధానంతో సహా అనేక వివరాలను మార్చేశాడు మస్క్. కానీ, ఇప్పటివరకూ ప్లాట్‌ఫారమ్ యూఆర్ఎల్ మార్చలేదు. ఎట్టకేలకు ఎక్స్ అధికారిక్ యూఆర్ఎల్ గా మార్చేసినట్టు ప్రకటించాడు. అంతేకాదు.. బ్లూ కలర్ సర్కిల్‌పై వైట్ (X)తో ఉన్న లోగోను కూడా మస్క్ పోస్ట్ చేశాడు. లోగో రెండు బ్లూ కలర్లతో ఉంది.
All core systems are now on https://t.co/bOUOek5Cvy pic.twitter.com/cwWu3h2vzr
— Elon Musk (@elonmusk) May 17, 2024
ఈ ఫీచర్‌కు ఏడాదికి రూ.100 చెల్లించాల్సిందే :
ఎక్స్ పోస్ట్‌ను పోస్ట్ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్ చేయడం లేదా రీట్వీట్ చేయడం వంటి ట్విట్టర్ ఫంక్షనాలిటీలపై ఎక్స్ త్వరలో కొత్త యూజర్లకు ఛార్జీ విధించనున్నట్లు గత నెలలో మస్క్ ప్రకటించారు. సబ్‌స్క్రిప్షన్‌లో కేవలం తక్కువ రుసుముతో సంవత్సరానికి 1 డాలర్లు మాత్రమే ఉంటుంది. అదే భారతీయ యూజర్లకు దాదాపు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మస్క్ ఈ ఫీచర్ న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో పరీక్షించారు. అయితే, త్వరలో ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
2,500 కన్నా ఎక్కువ వెరిఫైడ్ సబ్‌స్క్రైబర్‌లను కలిగిన యూజర్లు Xలో అన్ని ప్రీమియం ఫీచర్‌లను ఉచితంగా యాక్సెస్ పొందుతారని మస్క్ ప్రకటించారు. రానురాను సబ్‌స్క్రైబర్ ఫాలోవర్‌లతో ఉన్న అన్ని ఎక్స్ అకౌంట్లు ఉచితంగా ప్రీమియం ఫీచర్‌లను పొందుతాయి. 5వేల కన్నా ఎక్కువ ఫాలోవర్లు ఉన్న అకౌంట్లకు ప్రీమియం ప్లస్ ఉచితంగా లభిస్తుందని మస్క్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను మరింత మెరుగుపరుస్తూ (xAI) చాట్‌బాట్, గ్రోక్ త్వరలో ప్రీమియం సబ్‌స్ర్కైబర్లకు అందుబాటులో ఉంటుందని మస్క్ వెల్లడించారు.
భారత్‌లో X అకౌంట్లపై స్పందన :
ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని నిర్దిష్ట అకౌంట్లు, పోస్ట్‌లపై చర్య తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను కోరుతూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మస్క్ పేర్కొన్నారు. గత ఫిబ్రవరి 2024లో ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్‌పై పోస్ట్‌లో.. కంపెనీ ఈ చర్యతో ఏకీభవించలేదు. భావప్రకటనా స్వేచ్ఛ కారణంగా పోస్ట్‌లను నిలిపివేసేది లేదని పేర్కొంది. అయితే, భారత ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది.