Spiritual

TTD: తిరుమలలో భక్తులు ఫుల్ హ్యాపీ, అన్నప్రసాదంలో రాజీ లేదు, రోజుకు!

Published

on

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో మంచి రోజులు వస్తున్నాయని భక్తులు అంటున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి తిరుమలలో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించలేదని భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే టీటీడీ ఈవోగా జే. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన తరువాత తిరుమలలో పరిస్థితులు మారుతున్నాయి.

టీటీడీలో ప్రక్షాళన మొదలైన తరువాత మొదట శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం పెద్దఎత్తున తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో విరివిగా అన్నప్రసాదం అందిస్తున్నారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో విరివిగా భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు.

అయితే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదంలో నాణ్యతలేదని గత కొంతకాలంగా భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. జే. శ్యామలరావు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్నప్రసాద నాణ్యతపై ఎక్కువ దృష్టి సారించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఈవో శ్యామలరావు అన్నప్రసాదం ఎలా ఉంది అంటూ శ్రీవారి భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version