Telangana
TS EAPCET 2024 Admit Card: తెలంగాణ ఈఏపీసెట్ 2024 హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఈఏపీసెట్ 2024 హాల్‌టికెట్లు సోమవారం (ఏప్రిల్ 29) సాయంత్రం 5 గంటలకు విడుదలయ్యాయి. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన హాల్ టికెట్లను మాత్రమే ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లను మే 1వ తేదీన అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్షలు మే 7 నుంచి మే 11 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. మే 7న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరుగుతుంది. మే 8న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఇక ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో జరగనున్నాయి.
ఈ ఏడాది ఎప్‌సెట్‌కు మొత్తంగా దాదాపు 3,54,803 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగానికి 1,00,260 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,54,543 మంది ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేశారు. మొత్తం 21 జోన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. వీటిల్లో తెలంగాణలో 16 జోన్లు, ఏపీలో 5 జోన్లు ఏర్పాటు చేశారు. కాగా రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు ఈఏపీసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Important Links
Official Website – eapcet.tsche.ac.in
TS EAMCET Hall Ticket (A&P) – Download here