Andhrapradesh

TS Admissions: ముగుస్తున్న విభజన చట్టం గడువు, ఆ పరీక్షలకు మాత్రమే ఉమ్మడి ప్రవేశాలు, జూన్‌ 2తో ఏపీ ఇక నాన్‌ లోకల్‌…

Published

on

TS Admissions: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో (AP ReOrganizaton Act) విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల Common Admissions గడువు ముగియనుండటంతో తెలంగాణ విద్యా శాఖ అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పదేళ్ల పాటు రెండు రాష్ట్రాల విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలకు వీలు కల్పించిన నిబంధన గడువు జూన్‌ 2తో ముగియనుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి కానుండటంతో విభజన చట్టంలోని నిబంధనల చెల్లుబాటు కూడా ముగియనుంది.

AP ఏపీ స్థానికత కలిగిన విద్యార్ధులకు telangana తెలంగాణ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈ ఏడాదే చివరి అవకాశం కానుంది. ఇకపై ఏపీ విద్యార్ధులు నాన్‌ లోకల్ కోటాలోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది.

తెలంగాణలో వివిధ విద్యా సంస్థల్లో Admissions ప్రవేశాల కోసం అయా యూనివర్శిటీలు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఏటా కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షల్ని నిర్వహిస్తుంటాయి. ఈఏపీ సెట్‌(గతంలో ఎంసెట్), ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌ సెట్‌ వంటి పరీక్షలతో పాటు పీజీ ఎంట్రన్స్‌లను ఆయా వర్శిటీలు నిర్వహించేవి. ఈ విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్ధులతో పాటు గత పదేళ్లుగా ఏపీ విద్యార్ధులకు కూడా ప్రవేశాలు దక్కాయి.

రాష్ట్ర విభజన గడువు ముగియనుండటంతో ఈ ఏడాది జూన్‌2లోపు జరిగే ప్రవేశ పరీక్షలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తింప చేయనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం స్పష్టత ఇచ్చారు. ఏపీ విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల నిబంధనకు గడువు 2024 జూన్‌2తో ముగిసిపోతుంది.

ఇకపై తెలంగాణ విద్యా సంస్థల్లో ఉన్న సీట్లు మొత్తం తెలంగాణ స్థానికత కలిగిన వారికే అందుబాటులోకి వస్తాయి. ఏపీ విద్యార్ధులు తెలంగాణ ప్రవేశ పరీక్షలు రాసినా నాన్ లోకల్ క్యాటగిరీలో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణ విద్యా సంస్థల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని విద్యాశాఖ కార్యదర్శి స్పష్టత ఇచ్చారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్ధులకు రిజర్వేషన్లు వర్తించవని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది. ఆ తర్వాత ఏపీ కూడా అదే బాటలో కొత్త మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తూ జీవో జారీ చేసింది.

ముగియనున్న బంధం…
తెలంగాణ రాష్ట్రంతో ఏపీకి ఉన్న బంధం జూన్‌ 2 తర్వాత శాశ్వతంగా ముగియనుంది. ఇకపై దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరే ఏపీ స్థానికత కలిగిన వారు కూడా తెలంగాణలో విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. వారికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు, రిజర్వేషన్లు వర్తించవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version