International
వణికిస్తున్న టోర్నడోలు.. ప్రమాదంలో 3.4 కోట్ల మంది ప్రజలు
అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలపై విరుచుకుపడుతున్న టోర్నడోలతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో టోర్నడోలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ.. అక్కడి పరిస్థితిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రంపై ఈ టోర్నడోల ప్రభావం అధికంగా ఉంది. టెక్సాస్ రాష్ట్రంలోని టెంపుల్ నగరంలో ఏర్పడిన ఓ భారీ టోర్నడోకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
🚨 TEMPLE, TEXAS TORNADO – Tornado on the ground on Temple, TX, U.S#Temple #TempleTornado #TempleTexas #TX #TexasTornado #Houston #Iowa pic.twitter.com/pfyOXw4EtE
— T R U T H P O L E (@Truthpolex) May 23, 2024
బుధవారం రోజున టెంపుల్ నగరంలో ఓ భారీ టోర్నడో ఏర్పడింది. ఆ టోర్నడో ఆగ్నేయం వైపు కదులుతున్నట్లు కనిపించింది. దీంతో ఆ ప్రాంతంలో వాతావరణం తీవ్ర అల్లకల్లోలంగా ఉందని అధికారులు వెల్లడించారు. మరిన్ని టోర్నడోలు ఏర్పడటంతోపాటు గంటకు 80 మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు. బెల్టన్, సలాడో, లోట్, రోజ్‌బడ్ ప్రాంతాల్లో ఈ టోర్నడోల బీభత్సం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కూడా నేషనల్ వెదర్ సర్వీస్.. కొన్ని హెచ్చరికలు చేసింది.
Temple, Texas tornado a little while ago. 2024 is just crazy. Tornado after tornado going through populated areas. 🎥 @kwtx pic.twitter.com/sP34NJ5MNO
— Michael Armstrong (@KOCOMichael) May 23, 2024
మరిన్ని టోర్నడోలు టెక్సాస్ రాష్ట్రంపై విరుచుకుపడే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. ఇక టెక్సాస్‌లోని టెంపుల్ నగరంలో సుమారు లక్ష మంది ప్రజలు జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేషనల్ వెదర్ సర్వీస్.. టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు ఉన్న రాష్ట్రాలకు లెవల్-2 తుఫాన్ హెచ్చరికలు చేసింది.
టెక్సాస్, అర్కన్సాస్, ఓక్లహోమా, టెన్నెస్సీ, కాన్సాస్, నెబ్రస్కా, పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, కెంటకీ, వెస్ట్ వర్జీనియా, వర్జీనియా, న్యూయార్క్ రాష్ట్రాల్లు తుఫాన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో సుమారు 3.4 కోట్ల మంది ప్రజలు ఈ లెవల్ 2 తుఫాను కారణంగా ముప్పులో ఉన్నట్లు తెలిపింది.
Significant damage to homes on the west side of Temple, Texas after a possible tornado this evening.#Texas #tornado #damage pic.twitter.com/FqN4zPHTr0
— News Update (@ChaudharyParvez) May 23, 2024
ఓస్వెగో, న్యూయార్క్, జెనీవా, ఫల్టన్ వంటి రాష్ట్రాలకు నేషనల్ వెదర్ సర్వీస్ తీవ్ర తుఫాను హెచ్చరికలు చేసింది. ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బలమైన గాలులు, భారీ వర్షం, వడగళ్ల వాన వంటి భీకర వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది.