National

Traffic Rules: మీరు బైక్ నడుపుతున్నారా.. ఈ కొత్త ట్రాఫిక్ రూల్ తెలుసా?

Published

on

Traffic Rules: మనలో చాలా మంది నిత్యం వాహనాలు తీసుకుని రోడ్డుపైకి వెళ్తూ ఉంటాం. అయితే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కొందరు వాహనాలు నడిపిస్తూ ఉంటే.. మరికొందరు వాటిని పట్టించుకోకుండానే రయ్ మంటూ దూసుకెళ్తూ ఉంటారు. బైక్, ఆటో, కారు, లారీ.. ఇలా వాహనం ఏదైనా వాటికి కొన్ని ట్రాఫిక్ రూల్స్‌ను.. రవాణా శాఖ అధికారులు పెడుతూ ఉంటారు. అయితే కొందరు ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా వెళ్లి.. వాటిని ఉల్లంఘిస్తుండగా.. మరికొందరు మాత్రం నిబంధనలు తెలిసినా ట్రాఫిక్ రూల్స్‌ను పట్టించుకోకుండా వెళ్తూ ఉంటారు. ఇలాంటి వారినే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని భారీగా జరిమానాలు విధిస్తూ ఉంటారు. అయితే తాజాగా ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్‌ను తీసుకువచ్చారు.

ఇప్పటివరకు వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడటం మాత్రమే నేరం అని రూల్స్ ఉండేవి. ఏ వాహనదారుడైన డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్‌లో మాట్లాడితే ఫైన్లు వేసేవారు. ఇక నుంచి బైక్‌పై వెళ్తున్నపుడు.. డ్రైవర్ తన వెనక కూర్చున్న వారితో మాట్లాడటం కూడా ట్రాఫిక్ ఉల్లంఘన కిందికే వస్తుందని కొత్త నిబంధన తీసుకువచ్చారు. కేరళ రాష్ట్ర మోటారు వాహనాల శాఖ – ఎంవీడీ.. ఈ కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. బైక్ నడిపే వ్యక్తి వెనక కూర్చున్న వారితో మాట్లాడటం ఇక నుంచి శిక్షార్హమైన నేరం అని కేరళ సర్కార్ తాజాగా విధించింది.

ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు ఆదేశాలు ఇచ్చింది. నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చినట్లు కేరళ మోటారు వాహనాల శాఖ స్పష్టం చేసింది.

బైక్ నడిపేవారు.. వెనుక కూర్చున్న వారితో ముచ్చట్లలో మునిగిపోతూ.. డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఇది గుర్తించిన తర్వాతే ఈ నిబంధనను తీసుకున్నట్లు జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కే మనోజ్‌ కుమార్‌ వెల్లడించారు. వెనుక కూర్చొని ఉన్న వారితో మాట్లాడేందుకు బైక్‌ నడిపే వారు తల వెనక్కి తిప్పడం.. ఒకవైపు తిరగడం వల్ల డ్రైవింగ్ సరిగా చేయడం లేదని ఫలితంగా బైక్‌పై పట్టు కోల్పోయి ప్రమాదాలకు కారణం అవుతున్నారని చెప్పారు.

ఈ కొత్త నిబంధనను ఉల్లంఘించి.. బైక్‌ నడిపే సమయంలో వెనుక కూర్చున్న వారితో మాట్లాడే వారికి ఇక నుంచి జరిమానాలు విధిస్తామని తెలిపారు. అయితే ఆ జరిమానా ఎంత అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. అయితే ఈ కొత్త నిబంధన పట్ల కేరళ వాహనదారుల్లో రకరకాల వాదనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version