Connect with us

International

‘ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది- సామాన్యులకు హాని జరగకూడదు’ ఇజ్రాయెల్​పై అమెరికా ఫైర్! – Israel Hamas War

Published

on

US On Rafah Attack : రఫాలో ఇజ్రాయెల్‌ ఆదివారం జరిపిన దాడులను అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు సహా పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దాడి దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయని తెలిపింది. సామాన్య పౌరులకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలని ఇజ్రాయెల్​ను అమెరికా కోరింది.

‘రఫాలో ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో సామాన్య పౌరులు మరణించిన దృశ్యాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ దృశ్యాలను చూస్తుంటే హృదయం తరుక్కుపోతోంది. అవి చాలా భయానకంగా ఉన్నాయి. హమాస్‌తో జరుగుతున్న ఈ పోరులో సామాన్యులకు ఎలాంటి హాని జరగొద్దు. అయితే హమాస్‌కు బుద్ధి చెప్పడం కోసం దాడి చేసే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. కానీ, అది సామాన్య పౌరులకు ఎలాంటి ముప్పు తలపెట్టకుండా ఉండాలి. అందుకోసం ఇజ్రాయెల్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హమాస్‌ పెద్ద నాయకులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. అదే సమయంలో పౌరుల ప్రాణాలు కూడా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని శ్వేతసౌధంలోని జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక సమాచార విభాగం సమన్వయకర్త జాన్‌ కిర్బీ అన్నారు.

‘ఇజ్రాయెల్ విషయంలో ఎలాంటి మార్పు లేదు’
అయితే రఫాలో భూతల దాడులు అవసరం లేదని తాము భావిస్తున్నట్లు జాన్ కిర్బీ వెల్లడించారు. దీనిపై ఇజ్రాయెల్​తో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఉన్నారు. అలానే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు రఫాలో ఇజ్రాయెల్‌ దాడి తర్వాత కూడా ఆ దేశం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విధానంలో ఎలాంటి మార్పు లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. దీంతో ఇజ్రాయెల్‌ విషయంలో అమెరికా నిర్దేశించుకున్న హద్దులు ఇంకా ఆ దేశం మీరలేదనే విషయం వెల్లడవుతోందని నిపుణులు విశ్లేషించారు.

రఫాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌ చేసిన భీకర దాడుల్లో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. అయితే దాడి జరిగిన తల్‌ అల్‌ సుల్తాన్‌ ప్రాంతాన్ని సురక్షితమైనదిగా ఇజ్రాయెలే ప్రకటించింది. దీంతో చాలా మంది ఇక్కడకు వచ్చి తలదాచుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంపైనే దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయినప్పటికీ ఇజ్రాయెల్‌ దాడుల్లో సోమవారం రాత్రి, మంగళవారం మరో 37 మంది పాలస్తీనీయన్లు మృతి చెందడం గమనార్హం.

స్వతంత్ర దేశంగా పాలస్తీనా
మరోవైపు గాజాలో సంక్షోభం తారస్థాయికి చేరిన వేళ, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మంగళవారం నుంచి అధికారికంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్‌ ప్రకటించాయి. పాలస్తీనీయన్లు, ఇజ్రాయెలీలు శాంతిని సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ తెలిపారు.

Advertisement

International

20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం

Published

on

భారతదేశం సంస్కృతి( Indian culture ) విభిన్నతకు పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో రకాల భాషలు, సంప్రదాయాలు ఉంటాయి. అందుకే ఇండియాలో దొరికే అనుభవం ప్రపంచంలో మరెక్కడా దొరకదు.
మన దేశంలోని రుచికరమైన వంటకాలు, అందమైన ప్రకృతి దృశ్యాలు, చూడదగ్గ టూరిస్ట్ స్పాట్స్ ఎంతో ఆకర్షిస్తాయి. కొంతమంది భారతదేశాన్నే తమ స్థావర నివాసంగా కూడా ఎంచుకుంటారు. ఇలా ఇరవై సంవత్సరాలకు పైగా భారతదేశాన్నే తన స్వదేశంగా బతుకుతున్నాడో ఓ ఫ్రెంచ్ వ్యక్తి. ఆయన పేరు జీన్-బాప్టిస్టే.
21 ఏళ్లుగా ఇండియాలో నివసిస్తున్న ఈ ఫ్రెంచ్ వ్యక్తి భారత్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఏం చెప్పారో తెలుసుకుందాం.

జీన్-బాప్టిస్టే 2002లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ ( JNU )లో చదువుకోవడానికి భారతదేశానికి వచ్చాడు. చదువు పూర్తి చేసిన తర్వాత, 21 సంవత్సరాలుగా ముంబైలో నివాసముంటున్నాడు.

ఇటీవలే యూట్యూబ్ వీడియో ద్వారా భారతదేశం, ఇక్కడి ప్రజలపై తన అభిమానాన్ని పంచుకున్నాడు. భారతదేశం, ఫ్రాన్స్ సంస్కృతుల మధ్య కొన్ని తేడాలు ఉన్నప్పటికీ, కుటుంబ ప్రాముఖ్యత, స్నేహాలలో అనేక సిమిలారిటిస్ కూడా ఉన్నాయని అతను గుర్తించాడు.భారతదేశ సంప్రదాయాలకు జీన్-బాప్టిస్టే( Jean-Baptiste ) బాగా అలవాటు పడ్డాడు. స్థానికులతో మెరుగ్గా మాట్లాడటానికి, తల ఊపు వంటి కొన్ని సాధారణ పదబంధాలను కూడా నేర్చుకున్నాడు. జెఎన్‌యులో జీన్-బాప్టిస్టే తన మొదటి స్నేహితులను సంపాదించుకున్నాడు, వారితో అనుబంధం ఏర్పడ్డాక భారతీయుల విలువలు అతనికి తెలిసాయి.

భారతదేశంలో మార్పుల వేగం నెమ్మదిగా ఉండటాన్ని జీన్-బాప్టిస్టే అభినందిస్తున్నాడు. ఇది ప్రజలు తమ తప్పుల నుంచి నేర్చుకోవడానికి, జాగ్రత్తగా ముందుకు సాగడానికి అనుమతిస్తుందని అతను నమ్ముతున్నాడు. భారతీయ ప్రజలలో శాంతిని కనుగొన్నాడు, పాశ్చాత్యులతో పోలిస్తే మన దేశస్థులకు పెద్దగా అహంకారాలు లేవని అతను అన్నాడు. మరింత నిజమైన అనుభవం కోసం విదేశీయులు భారతదేశంలోని తక్కువ తెలిసిన ప్రదేశాలను అన్వేషించాలని అతను సలహా ఇస్తున్నాడు.ఏళ్లు గడుస్తున్న కొద్దీ, జీన్-బాప్టిస్టే జీవితంలో శాంతియుత విధానాన్ని అవలంబించడం ప్రారంభించాడు.
సాధ్యమైనంతవరకు ఘర్షణలు, వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. భారతదేశంలో తాను మనశ్శాంతిని కనుగొన్నానని అతను చెబుతున్నాడు. ఫ్రాన్స్‌లో ఇలాంటి మనశ్శాంతి దొరకలేదని అతని చెప్పాడు. జీన్ ప్రయాణం భారతదేశంతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా దీనిని తన స్వదేశంగా ఫీలవుతున్నాడు.

Continue Reading

International

ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు- రూ.4లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటన- ఇటలీకి మోదీ – G7 Summit 2024

Published

on

G7 Summit Ukraine : రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి రూ.4.17 లక్షల కోట్ల (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని తీర్మానించాయి. ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ గురువారం ఈ మేరకు కీలక పరిణామం జరిగింది.

రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాదాపు రూ.21.72 లక్షల కోట్ల విలువైన ఆ దేశ ఆస్తులు స్తంభింపజేసి ఉన్నాయి. వాటిలో అత్యధికం ఐరోపా దేశాల్లోనివే. సాంకేతికంగా, చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సమకూర్చాలన్నదానిపై జీ7 దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరపనున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి భారీ విధ్వంసం సృష్టించినందుకు రష్యా పరిహారం చెల్లించేదాకా. ప్రస్తుతం స్తంభింపజేసిన ఆ దేశ ఆస్తులపై ఆంక్షలను తొలగించకూడదనీ అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి.

తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే ఉక్రెయిన్‌కు అందనున్నాయి. శుక్రవారం దీనిపై సంయుక్త ప్రకటన వెలువడనుంది. జీ7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్యదేశాలు. ఉక్రెయిన్‌కు సైనికేతర సాయం కింద తాము సొంతంగా 31 కోట్ల డాలర్లు అందజేయనున్నట్లు బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ తాజాగా ప్రకటించారు.


శిఖరాగ్ర సదస్సు ప్రారంభం
జీ7 శిఖరాగ్ర సదస్సు ఇటలీలో అపులియా ప్రాంతంలోని విలాసవంతమైన బోర్గో ఇగ్నాజియా రిసార్టులో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు- భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తదితరులు తాజా సదస్సులో అతిథుల హోదాలో పాల్గొననున్నారు.

Advertisement

ఇటలీకి పయనమైన మోదీ
జీ7 శిఖరాగ్ర సదస్సు అనుబంధ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం ఇటలీ చేరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అక్కడి సమావేశంలో ప్రధానంగా కృత్రిమ మేధ (ఏఐ), ఇంధనం, మధ్యధరా, ఆఫ్రికా దేశాల్లో పరిస్థితులపై తాను చర్చించనున్నట్లు ప్రయాణ ప్రారంభానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గ్లోబల్‌ సౌత్‌కు కీలకమైన అంశాలపైనా సమాలోచనలు జరపనున్నట్లు తెలిపారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే.

Continue Reading

International

‘రష్యా అలా చేసే వరకు ఆ దేశ ఆస్తులు లాక్​ చేస్తాం’- ఉక్రెయిన్​కు సపోర్ట్​గా అమెరికా, EU మాస్టర్ ప్లాన్!

Published

on

US Europe Lock Up Russian Assets : ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మాస్కో పరిహారం చెల్లించే వరకు, రష్యా ఆస్తులు లాక్​ చేయాలని అమెరికా, యురోపియన్ యూనియన్ అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా సీనియర్ అధికారి ఒకరు గురువారం వివరాలు వెల్లడించారు. దీంతో జీ7 మీటింగ్​లో ఉక్రెయిన్​కు 50 బిలియన్ డాలర్ల లోన్​ ప్యాకేజీని ప్రకటించేందుకు నేతలకు మార్గం సుగమమైంది. మరోవైపు జీ7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ బయలుదేరారు. జీ7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా, గ్లోబల్‌ సౌత్‌ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనే ఇతర నేతలతో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

Continue Reading
National4 hours ago

‘నీట్​ నిర్వహణలో 0.001శాతం నిర్లక్ష్యం ఉన్నా పూర్తిగా పరిష్కరించాలి’- NTA, కేంద్రంతో సుప్రీం

National4 hours ago

భారీ వర్షాలతో చిక్కుకుపోయిన పర్యటకులు- సిక్కింలో BRO రెస్క్యూ ఆపరేషన్​ స్టార్ట్​

Technology11 hours ago

టార్గెట్ బీజేపీ? ఈవీఎంలపై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణల వెనుక అనేక అనుమానాలు

Spiritual11 hours ago

యువతలో విపరీతంగా పెరిగిన భక్తి భావం, ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన.. ఈ మార్పునకు కారణం అదేనా?

Andhrapradesh12 hours ago

AP Inter Supply Results 2024: నేడే ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

Telangana12 hours ago

TG PGECET 2024 Results Today: నేడే తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Cricket12 hours ago

T20 World Cup 2024: 4 ఓవర్లు.. 4 మెయిడిన్లు.. 3 వికెట్లు.. ప్రపంచకప్‌లో పెను సంచలనం.. బంతులు కావవి బుల్లెట్లు

Agriculture12 hours ago

PM Kisan: నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ డబ్బులు..స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం ఎలా?

Andhrapradesh23 hours ago

ఈ నెల 24 నుండి అసెంబ్లీ సమావేశాలు

National1 day ago

5రోజుల్లో లక్ష మందిని కలిసిన ముఖ్యమంత్రి- జెట్​ స్పీడ్​లో కొత్త సీఎం

Andhrapradesh1 day ago

AP Pension Hike : జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు, జీవోలో లేని 50 ఏళ్లకే పెన్షన్ అంశం

National1 day ago

Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాదానికి కారణం అదే.. చిన్న తప్పిదంతో ఘోరం!

Andhrapradesh1 day ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

National1 day ago

Kanchanjungha Express: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదంలో భారీగా పెరుగుతున్న మృతులు.. కాంచనజంగా‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గూడ్స్

Political1 day ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Railways1 day ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

News1 day ago

ఈపీఎఫ్ఓ …పెనాల్టీ తగ్గింపు

National2 days ago

ఎనిమిదో వింతగా ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి- త్వరలోనే ట్రైన్​ పరుగులు! – Chenab Railway Bridge

National2 days ago

Petrol Prices Hike : వాహనదారులకు భారీ షాక్.. రూ. 3 పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Cricket2 days ago

IND vs SA: సఫారీలపై సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన.. దెబ్బకు రికార్డులు బద్దలు కొట్టిందిగా!

Cricket2 days ago

IND vs SA: అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా.. ఏకంగా 143 రన్స్ తేడాతో..

Andhrapradesh2 days ago

Anna Canteens: అన్న క్యాంటిన్ల ప్రారంభానికి ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు.. సమీక్షించిన మంత్రి నారాయణ

International2 days ago

20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం

Cricket3 days ago

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో టీమిండియా ఏఏ జట్లతో ఎప్పుడు తలపడుతుందో తెలుసా..

Technology3 days ago

Google Magic Editor : గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్ ఇదిగో.. ఇకపై అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోకి..!

Andhrapradesh3 days ago

ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…

Andhrapradesh3 days ago

Anna Canteens: ఈసారి అన్నా క్యాంటీన్లలో రేట్లు ఇవే..!

Hyderabad3 days ago

ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి

National3 days ago

కేరళకు కువైట్ అగ్నిప్రమాద బాధితుల మృతదేహాలు- సీఎం పినరయి నివాళులు – Kuwait Fire Tragedy

National3 days ago

జులై 22న కేంద్ర బడ్జెట్‌ – జులై 3న ఆర్థిక సర్వే! – Union Budget 2024

Business3 weeks ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career3 weeks ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business3 weeks ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

News3 weeks ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

National2 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business3 weeks ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

Crime News1 week ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

National3 weeks ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Education1 week ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

Andhrapradesh1 week ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

National1 week ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

National1 week ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Andhrapradesh1 week ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National1 week ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Andhrapradesh1 week ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Andhrapradesh1 week ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Spiritual3 weeks ago

చార్ ధామ్ యాత్ర‌కు పొటెత్తిన భక్తులు.. గ‌త ఏడాదికంటే ఎక్కువే!

Telangana3 weeks ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Spiritual1 week ago

Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

Spiritual1 week ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

Andhrapradesh3 weeks ago

అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara

Business3 weeks ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Andhrapradesh7 days ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Andhrapradesh1 week ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

National3 weeks ago

ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar

News1 month ago

డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…

Andhrapradesh3 weeks ago

AP EAPCET 2024 Result Date: జూన్‌ మొదటి వారంలో ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల ఎప్పుడంటే

Life Style1 month ago

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

National3 weeks ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Political1 week ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Trending