Success story
విశ్వసుందరి కిరీటాన్ని దక్కించకున్న క్రిస్టినా పిస్కోవా
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 71వ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. ఇందులో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు.
విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారు. ఇక రన్నరప్‌గా లెబనాన్‌కు చెందిన అజైటౌన్ నిలిచారు. 25 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా మిస్ వరల్డ్ పోటీసులు జరిగాయి. 71వ మిస్ వరల్డ్ పోటీల్లో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. ఈసారి భారీ అంచనాలతో మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచిన భారత్‌కు చివరకు నిరాశే ఎదురైంది. భారత్ తరఫున పోటీల్లో పాల్గొన్న సినీ శెట్టి 8వ స్థానంలో నిలిచారు.
మిస్ వరల్డ్ పోటీల్లో వరుసగా టాప్-4 స్థానాల్లో నిలిచిన భామలు..క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్) , యాస్ఇన్ అజైటౌన్ (లెబనాన్), అచె అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసాగో చోంబో (బోట్స్వానా)లు ఉన్నారు. ఇక చివరి వరకు ఈ పోటీల్లో ఉత్కంఠ కనిపించింది. కానీ టాప్-2 కి క్రిస్టినా, అజైటౌన్ వెళ్లారు. వీరిలో క్రిస్టినాకే అదృష్టం వరించింది. మిస్ట్ వరల్డ్ 2024 కిరీటాన్ని అందుకుంది. ఇక మన దేశం తరఫున కర్ణాటకకు చెందిన సినీ శెట్టి టాప్-8 వరకు వెళ్లింది. అందరూ సినీ శెట్టి ఈసారి విన్నర్‌గా నిలుస్తుందని భావించినా.. నిరాశే దక్కింది. ఆమె టాప్-8 స్థానంతో సరిపెట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ అతిథిగా పాల్గొన్నారు. ఆమెకు ఈవెంట్ నిర్వాహకులు మిస్‌వరల్డ్ హ్యుమానిటేరియన్ అవరార్డును అందించారు. 28 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. చివరి సారి 1996లో భారత్‌లో విశ్వసుందరీ పోటీలు జరిగాయి. అప్పుడు గ్రీస్‌కు చెందిన ఇరెనా స్క్లీవా విజేతగా నిలిచారు. అప్పుడు ఇండియా టాప్-5 వరకు వెళ్లింది.