International

Thames River: మురికి నీటి నుంచి ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నదిగా థేమ్స్ రివర్.. ఎలా మారిందో తెలుసా..

Published

on

1850లో పారిశ్రామిక వ్యర్థాలు థేమ్స్‌లోకి పరిమితులను దాటి విడుదల చేసేవారు. దీంతో థేమ్స్‌లోకి ప్రవహించే మురుగునీరుతో వాతావరణ పరిస్థితులు వేగంగా క్షీణించాయి. ఎంతగా అంటే పరిస్థితి విషమించి ఆ నది నీరు ప్రాణాను తీసే మృత్యువుగా మారింది. దీంతో నదిలో నీరుని శుభ్ర పరిచే బాధ్యతను సివిల్ ఇంజనీర్ సర్ జోసెఫ్ బజల్గెట్టేకి అప్పగించారు. నేటికీ వాడుకలో ఉన్న మురుగునీటి నెట్‌వర్క్‌ను నిర్మించే పనిని అతనికి అప్పగించారు. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు తరువాతి కొన్ని దశాబ్దాలలో నిర్మించబడ్డాయి. ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం పెరిగింది.

నదుల్లో కాలుష్యం సమస్య భారతదేశంలోనే కాదు లండన్ వంటి నగరాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే థేమ్స్ నది స్ఫూర్తిదాయకంగా ఉంది. 1957లో నేషనల్ హిస్టరీ మ్యూజియం ఈ నదిని డెడ్ రివర్ అని పిలిచేంత మురికిగా ఉండేది థేమ్స్ నది. డెడ్ రివర్ అంటే జంతువులు కూడా జీవించలేని విధంగా మురికి నీరు ఉన్న నది అని అర్ధం. అయితే ఇప్పుడు అదే థేమ్స్ ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నది. స్వచ్ఛమైన నీరుకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.

నేడు నదుల శుభ్రం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం. నదుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవడం, వాటిని రక్షించడం, వాటి గురించి అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను ఈ రోజున నిర్వహిస్తారు. అయితే లండన్‌లోని థేమ్స్ నది.. మృత నది నుంచి ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నదిగా మారిన ప్రయాణం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

వేగంగా క్షీణించింన పరిస్థితి
1850లో పారిశ్రామిక వ్యర్థాలు థేమ్స్‌లోకి పరిమితులను దాటి విడుదల చేసేవారు. దీంతో థేమ్స్‌లోకి ప్రవహించే మురుగునీరుతో వాతావరణ పరిస్థితులు వేగంగా క్షీణించాయి. ఎంతగా అంటే పరిస్థితి విషమించి ఆ నది నీరు ప్రాణాను తీసే మృత్యువుగా మారింది. దీంతో నదిలో నీరుని శుభ్ర పరిచే బాధ్యతను సివిల్ ఇంజనీర్ సర్ జోసెఫ్ బజల్గెట్టేకి అప్పగించారు. నేటికీ వాడుకలో ఉన్న మురుగునీటి నెట్‌వర్క్‌ను నిర్మించే పనిని అతనికి అప్పగించారు. మురుగునీటి శుభ్ర పరిచే బాధ్యతను సివిల్ ఇంజనీర్ సర్ జోసెఫ్ బజల్గెట్టేకి అప్పగించారు. నేటికీ వాడుకలో ఉన్న మురుగునీటి నెట్‌వర్క్‌ను నిర్మించే పనిని అతనికి అప్పగించారు. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు తరువాతి కొన్ని దశాబ్దాలలో నిర్మించబడ్డాయి. ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం పెరిగింది.

అనేక సంవత్సరాల కృషితో నేడు థేమ్స్ నది
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన బాంబు దాడులతో అనేక ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితి మెరుగుపడటం మొదలైంది. యుద్ధ సమయంలో బాంబులు వేయడం వల్ల మురుగునీటి నెట్‌వర్క్‌లోని అనేక భాగాలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల మురుగు మళ్లీ నదిలోకి ప్రవేశించింది. నీరు విషతుల్యంగా మారడంతో చేపల పెంపకం కష్టంగా మారింది. చేపలు వృద్ధి చెందాలంటే, అవి నివసించే నీటిలో లీటరుకు కనీసం 4-5 మిల్లీగ్రాముల కరిగిన ఆక్సిజన్ ఉండాలి. 1950వ దశకంలో నీటి పరీక్షలో ఆక్సిజన్ స్థాయి ప్రమాణంలో 5 శాతం మాత్రమే ఉందని తేలింది.

Advertisement

1950లలో సెంట్రల్ లండన్ గుండా ప్రవహించే థేమ్స్ 20 మైళ్లలో కరిగిన ఆక్సిజన్ స్థాయిలు లేవు. 69 కిలో మీటర్ల పొడవైన నదిలో చేపలు కూడా లేవు. 1957 సర్వేలో సమాచారం తరువాత థేమ్స్ డెడ్ రివర్ గా ప్రకటించారు.

నది పరిరక్షణ కోసం టర్నింగ్ పాయింట్
థేమ్స్‌ను రక్షించడానికి క్లీనింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. 1976 నుంచి థేమ్స్‌లో కలిసే మురికి కాలువలు విషయంలో నిషేధం మొదలయ్యాయి. 1961 నుంచి 1995 మధ్య, కఠినమైన చట్టాలను అమలు చేసి.. నదిలోని నీటి నాణ్యత ప్రమాణాలను పెంచడానికి కఠినమైన చర్యలు తీసుకున్నారు. అప్పటి బ్రిటిష్ ప్రధాన మంత్రి మార్గరెట్ థాచర్ పర్యవేక్షణతో పాటు 1989లో రక్షిత జాతీయ నదుల అథారిటీని ఏర్పాటు చేశారు.

థేమ్స్‌లో ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి.. పెద్ద ఆక్సిజనేటర్ లేదా బబ్లర్‌ను ఏర్పాటు చేశారు. వాటర్ అథారిటీ 1980ల ప్రారంభంలో నది ఒడ్డున ప్రోటోటైప్ ఆక్సిజనేటర్‌లను అభివృద్ధి చేసింది. నీటిలో ఆక్సిజన్ , చేపల సంఖ్యను పెంచడంలో ఈ చర్యలు ఒక మలుపుగా నిలిచాయి. నీరు తేట తెల్లమైంది. ఆక్సిజన్ పరిమాణం కూడా పెరిగింది. నీటిలో పెరిగే జీవుల సంఖ్య కూడా పెరిగింది. నిరంతర అభివృద్ధి కార్యక్రమాలతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నీరు ఉన్న నదిగా మారింది.

గ్రేటర్ లండన్‌లోని మురుగునీటి వ్యవస్థ 5 మిలియన్ల కంటే తక్కువ ప్రజల కోసం రూపొందించబడింది. అయితే ఇప్పుడు 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పెరిగిన జనాభా భారాన్ని నిర్వహించడానికి లండన్‌లో 25 కి.మీ పొడవున్న కొత్త “సూపర్ మురుగు” కాలవ నిర్మించబడుతోంది. ఇది 2025 నాటికి పూర్తవుతుందని అంచనా.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version