National

బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు- 9మంది యాత్రికులు మృతి- 33మందికి గాయాలు – Jammu Kashmir Accident

Published

on

Jammu Kashmir Terror Attack : జమ్ముకశ్మీర్​లో రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై విచక్షణరహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడగా తొమ్మిది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడ్డారు. యాత్రికులంతా కత్రాలోని శివ ఖోరీ ఆలయం నుంచి మాతా వైష్ణో దేవి మందిరానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 6.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా ఉత్తర్​ప్రదేశ్​కు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై రియాసీ ఏసీపీ మోహితా శర్మ మీడియాతో మాట్లాడారు. “ప్రాథమిక నివేదికల ప్రకారం శివ ఖోరీ నుంచి బయలుదేరిన బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. డ్రైవర్ బ్యాలెన్స్ తప్పడం వల్ల వాహనం లోయలో పడిపోయింది” అని తెలిపారు.


25సార్లు కాల్పులు!
బస్సులో లోయలో పడిపోవడానికి ముందు 25 సార్లు కాల్పులు జరిపారని ఓ యాత్రికుడు తెలిపారు. రెడ్ కలర్ మఫ్లర్ ధరించిన ఓ వ్యక్తి బస్సుపై కాల్పులు జరిపిన్నట్లు మరో యాత్రికుడు తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో జమ్ముకశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండోసారి. జులై 2017లో కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఏడుగురు యాత్రికులు మరణించారు. 19 మంది గాయపడ్డారు.

Advertisement

ఎవరూ తప్పించుకోలేరు!
“రియాసీలో బస్సుపై జరిగిన ఉగ్రదాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరణించిన వారి కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఉగ్రవాదులను వేటాడేందుకు మా భద్రతా దళాలు, JKP సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి” అని జమ్ముకశ్మీర్ ఎల్​జీ మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడ్డవారెవరూ కూడా తప్పించుకోలేరని కేంద్ర హోంమంత్రి అమిషా హెచ్చరించారు. ఘటనపై ఆరా తీసినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version