Political

Telangana: దుమారం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ ఇష్యూ.. తొలిసారి స్పందించిన కేటీఆర్‌..

Published

on

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ట్యాపింగ్‌ వ్యవహారం తెరమీదకి తీసుకొచ్చారని కేటీఆర్‌ విమర్శిస్తే… లై డిటెక్టర్‌ పరీక్షకు కేటీఆర్‌ సిద్ధమా అని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది. అటు బీజేపీ కూడా ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు.. ట్యాపింగ్‌ కేసులో నిందితుల కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు..

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తెరపైకి వచ్చాక తెలంగాణలో పొలిటికల్‌ సునామీ చెలరేగింది. మాజీ ప్రభుత్వంపై పార్టీలు మండిపడుతూ వస్తున్నాయి. కొందరు నేతలు మా ఫోన్లు ట్యాప్‌ చేశారంటూ డీజీపీకి ఫిర్యాదులు అందించారు. ముఖ్యంగా ఈ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్‌రావు రాష్ట్ర డీజీపీకి కంప్లైంట్‌ చేశారు. అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రమేయం లేకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సాధ్యం కాదన్నారాయన. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు రఘునందన్‌రావు.

అటు కాంగ్రెస్‌ నేతలు పలువురు ఇప్పటికే డీజీపీని కలిసి వినతిపత్రం అందించారు. కాంగ్రెస్‌ ఎమ్మల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి.. కేటీఆర్‌ను టార్గెట్‌ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక.. కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు యెన్నం. ఈ వ్యవహారంలో కేసీఆర్‌, కేటీఆర్‌ జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. ఈ విషయంలో లై డిటెక్టర్‌కు వస్తారా? అంటూ సవాల్ విసిరారు MLA యెన్నం శ్రీనివాసరెడ్డి.

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉంటూ వచ్చిన బీఆర్‌ఎస్‌ ఫస్ట్‌ టైమ్‌ రియాక్ట్‌ అయింది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. ట్యాపింగ్‌పై కామెంట్‌ చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ఆరు గారడీలతో కాలం గడుపుతుందని విమర్శించారు. 10 లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందని..చేస్తే గిస్తే ఒక్కరో ఇద్దరివో ఫోన్లు ట్యాపింగ్ చేసుండొచ్చన్నారు. దొంగల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే పోలీసుల పని అన్నారు కేటీఆర్‌.
కేటీఆర్‌ కామెంట్స్‌పై ప్రత్యర్థి పార్టీలు ఎలా రియాక్ట్‌ అవుతాయన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version