Hyderabad

తెలంగాణ ప్రజలకు కష్టాలు..నిలిచిపోయిన మిషన్ భగీరథ నీటి సరఫరా!

Published

on

తెలంగాణ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. రెండు రోజులుగా నిలిచిపోయాయి మిషన్ భగీరథ నీటి సరఫరా. కనీసం తాగడానికి కూడా నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రజలు ఆగ్రహిస్తున్నారు.

అసలు వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది.

Mission Bhagiratha water supply which has been stalled for two days
అధికారులు కంటితుడుపుగా మంగళవారం గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా రెండు ట్రిప్పుల నీటిని సరఫరా చేశారు. అయితే.. ఆ నీరు గ్రామంలో ఏ మూలకూ సరిపోక ట్యాంకర్ వద్ద మహిళల మధ్య తోపులాట జరిగింది. ‘కనీసం తాగడానికి కూడా నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు’ అంటూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఇదే మండలంలోని జటప్రోల్, గోప్లాపురం, మంచాలకట్ట, ఎంగంపల్లి తండా గ్రామాల్లో కూడా వారం రోజులుగా తాగునీరు రావడం లేదని చెబుతున్నారు ప్రజలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version