Business

TDS: టీడీఎస్‌ అంటే ఏమిటి? దీన్ని ఉద్యోగి జీతంలో ఎందుకు కట్‌ చేస్తారు? వాపసు ఎలా పొందాలి?

Published

on

మీరు TDS గురించి చాలాసార్లు విని ఉంటారు. అంటే మూలం వద్ద పన్ను మినహాయించబడినది. కానీ మీరు దాని గురించి తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించి ఉండకపోవచ్చు. టీడీఎస్‌ ఎప్పుడు కట్‌ అవుతుంది? ఇది ఉద్యోగులందరికీ వర్తిస్తుందా? జీతం నుండి ఎంత శాతం TDS తీసివేయబడుతుంది. అలాగే దానిని రిటన్‌ తీసుకునేందుకు ప్రక్రియ ఏమిటి? ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. తద్వారా మీ ఆదాయాల నుండి తీసివేయబడిన మొత్తం గురించి మీకు ముఖ్యమైన సమాచారం ఉంటుంది.

1. TDS అంటే ఏమిటి?

TDS (Tax Deducted at Source) అనేది ఆదాయపు పన్ను మరొక ట్యాక్స్‌ రూపం అనే చెప్పాలి. వివిధ ఆదాయ వనరులపై టీడీఎస్‌ వర్తిస్తుంది. ఉదాహరణకు.. జీతం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదా ఏదైనా పెట్టుబడిపై వచ్చే వడ్డీపై ప్రభుత్వం TDS ద్వారా పన్ను వసూలు చేస్తుంది. అయితే, ప్రతి ఆదాయ వనరులకు టీడీఎస్‌ వర్తించదు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిబంధనలను రూపొందించింది.

2. TDS ఎవరికి వర్తిస్తుంది?

టీడీఎస్‌ కింద ఆదాయ వనరుల జాబితా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 192 నుండి 194L వరకు భాగస్వామ్యం చేయబడింది. ఇది టీడీఎస్‌ ఎప్పుడు తీసివేయడం జరుగుతుందో తెలియజేస్తుంది. జీతం ఆదాయం చెల్లింపు, పీఎఫ్‌ ముందస్తు ఉపసంహరణ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై పొందిన వడ్డీ, బీమా కంపెనీ మెచ్యూరిటీ, లాటరీలో పొందిన మొత్తం లేదా గుర్రపు పందెం వంటి క్రీడలపై గెలిచిన జాక్‌పాట్, కొన్ని ప్రభుత్వ పథకాలపై పొందిన ప్రయోజనాలపై టీడీఎస్‌ వర్తిస్తుందని గుర్తించుకోండి.

Advertisement

3. జీతం నుండి ఎంత శాతం టీడీఎస్‌ కట్‌ అవుతుంది

టీడీఎస్‌ రేట్లు ఒక శాతం నుండి 30 శాతం వరకు ప్రారంభమవుతాయి. జీతంపై టీడీఎస్‌ గురించి మాత్రమే మాట్లాడినట్లయితే, ఆదాయ స్లాబ్ ప్రకారం.. వ్యక్తి మొత్తం ఆదాయంపై 10 శాతం టీడీఎస్‌ విధించబడుతుంది. అదే సమయంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మెచ్యూరిటీపై 10 శాతం వరకు టీడీఎస్‌ చెల్లించాలి. కస్టమర్ తన పాన్ కార్డ్ సమాచారాన్ని బ్యాంకుకు ఇవ్వకుంటే 20 శాతం టీడీఎస్‌ ఛార్జ్ చేస్తారు.

4. టీడీఎస్‌ వాపసు ప్రక్రియ ఏమిటి?

ఆదాయపు పన్ను శాఖ ప్రజలకు టీడీఎస్ రీఫండ్ సదుపాయాన్ని కూడా కల్పించింది. సేకరించిన టీడీఎస్‌ని ఉపసంహరించుకోవడానికి మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసి, ఫారమ్ 15Gని బ్యాంక్‌కి సమర్పించాలి. దీని తర్వాత బ్యాంక్ తన వివరాలను ఆదాయపు పన్ను శాఖకు ఇస్తుంది. ఆదాయపు పన్ను శాఖ మీ స్థితిని తనిఖీ చేస్తుంది. ఈ విధంగా టీడీఎస్‌లో తీసివేయబడిన మొత్తాన్ని పొందవచ్చు. ఈ సమాచారాన్ని కూడా ఆన్‌లైన్‌లో కూడా చూడవచ్చు.

5. టీడీఎస్‌కి సంబంధించిన ఏ సమాచారం తప్పనిసరిగా ఉండాలి?

Advertisement

ఒక వ్యక్తి టీడీఎస్‌ కట్‌ అవుతుంటే అతను కొన్ని నిర్దిష్ట విషయాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఇలా సంబంధిత ఆర్థిక సంవత్సరంలో తగ్గించబడిన టీడీఎస్‌ రేటు ఎంత. టీడీఎస్‌ లేదా ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి చివరి తేదీ, టీడీఎస్‌ చెల్లింపు కోసం చివరి తేదీ, టీడీఎస్‌ రిటర్న్‌లను ఫైల్ చేయడానికి నిబంధనలు, షరతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version