Business
Tax on electric vehicles : అలర్ట్.. ఈవీలపై కొత్త ట్యాక్స్ విధించిన ప్రభుత్వం!
Karnataka government imposes Tax on electric vehicles : ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈవీ సెక్టార్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. పర్యావరణ పరిక్షణకు ఇది మంచి విషయం అని అందరు భావిస్తున్న సమయంలో.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలపై అదనంగా ట్యాక్స్‌లను వసూలు చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు.. కర్ణాటక మోటార్ వెహికిల్ ట్యాక్సేషన్ యాక్ట్ 2024ని సవరించింది. ఫలితంగా.. ప్రస్తుతం ఉన్న రోడ్డు ట్యాక్స్‌కు అదనంగా.. ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలపై 10శాతం లైఫ్‌టైమ్ ట్యాక్స్ కూడా పడనుంది. ఇది.. ఈవీ సేల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనలపై ట్యాక్స్ పెంపు..
కర్ణాటక మోటార్ వెహికిల్ ట్యాక్సేషన్ యాక్ట్ 2024కి చేసిన సవరణ ప్రకారం.. రూ. 25లక్షల కన్నా ఎక్కువ ధర ఉండే ఈవీలపై అదనంగా 10శాతం లైఫ్‌టైమ్ ట్యాక్స్ పడుతుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ట్యాక్స్ వేస్తారు.
“ఎలక్ట్రిసిటీపై నడిచే.. మోటార్ కార్స్, జీప్స్, ఓమ్నీబస్సులు, ప్రైవేట్ సర్వీస్ వెహికిల్స్‌పై, వాటి ధరల మీద అదనంగా 10శాతం లైఫ్‌టైమ్ ట్యాక్స్ వేస్తున్నాము. రూ. 25లక్షల కన్నా ఎక్కువ ధర ఉండే ఈవీలపై ఇది వర్తిస్తుంది,,” అని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఉంది.
Tax on electric vehicles in Karnataka : ఈ కొత్త ట్యాక్స్‌కి ముందే.. దేశంలోనే రోడ్డు ట్యాక్స్‌లు అధికంగా ఉన్న రాష్ట్రంగా నిలిచింది కర్ణాటక. ఇక్కడ.. వాహనాలపై 13శాతం నుంచి 20శాతం మధ్యలో ట్యాక్స్ వస్తోంది ప్రభుత్వం. ఇక ఇప్పుడు 10 పర్సెంట్ లైఫ్‌టైమ్ ట్యాక్స్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధరలు మరింత పెరగనున్నాయి. అయితే.. ప్యూర్ ఈవీలను రోడ్డు ట్యాక్స్ నుంచి మినహాయించిన కర్ణాటక ప్రభుత్వం.. హై ఎండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై ఇnewలా అదనంగా పన్నులు విధిస్తుండటం గమనార్హం. ఇక ఈవీలకు జీరో రిజిస్ట్రేషన్ ఫీజుతో రోడ్డు ట్యాక్స్ మినహాయింపును కూడా ఇస్తోంది కర్ణాటక ప్రభుతవం. ఇతర రాష్ట్రాల్లో.. ఈవీ పాలసీలతో సబ్సిడీలు ఇస్తున్నాయి.
ఇక కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయంతో.. ఎలక్ట్రిక్ కార్లపై ప్రభావం చూపుతుంది. కానీ.. రానున్న సంవత్సరాల్లో ఈవీ సెగ్మెంట్‌కు డిమాండ్ మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2030 నాటికి.. కర్ణాటకలో 23 లక్షలకుపైగా ఈవీలు అమ్ముడుపోతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇప్పటికే ఈ నెంబర్ 3లక్షలు దాటిపోయింది.