Cricket
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా.. జట్టు ఎంపికకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠ కొనసాగుతోంది. ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుంది. ఆ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభమవుతుంది. T20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ USA, వెస్టిండీస్‌లలో జూన్ 1-29 తేదీల మధ్య నిర్వహించనున్నారు. మొత్తం 20 జట్లు ప్రపంచకప్ ట్రోఫీ కోసం తలపడనున్నాయి. 29 రోజుల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీకి ముందు ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. టీ20 ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో పాల్గొనే మొత్తం 20 జట్లు మే 1లోగా అన్ని ఆటగాళ్ల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఏప్రిల్ నెలాఖరు నాటికి మొత్తం చిత్రంపై స్పష్టత వస్తుంది. అలాగే ఐసీసీ అనుమతితో మే 25 వరకు ఆటగాళ్ల పేర్లను మార్చుకోవచ్చు. ఈ మేరకు బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు సమాచారం అందించాయి.
HAPPY HOLI 🎉
The @icc Men’s #T20WorldCup Trophy Tour joined the celebrations in #Texas and they were out of this world 💃 🕺 ☄️ pic.twitter.com/GAxCdMQdPz
— T20 World Cup (@T20WorldCup) March 25, 2024
ఐపీఎల్‌లో ప్రదర్శనే కీలకం
పీటీఐ కథనం ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో టీమ్ ఇండియా ఎంపిక జరుగుతుంది. అప్పుడు ఐపీఎల్ తొలి దశ ముగియనుంది. కాబట్టి సెలక్షన్ కమిటీ ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరికి అవకాశం ఇవ్వకూడదో ఒక క్లారిటీ వస్తుంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్, ప్రదర్శన సెలక్షన్ కమిటీకి మరింత మార్గం సుగమం చేస్తాయి. ప్రపంచకప్‌లో పాల్గొనే టీం ఇండియా తొలి బ్యాచ్ మే 19న న్యూయార్క్ వెళ్లనుంది. అలాగే ఐపీఎల్ ప్లేఆఫ్‌లకు అర్హత సాధించని జట్ల ఆటగాళ్లను కూడా వెంట పంపే అవకాశముంది.
టీమ్ ఇండియా ఏ గ్రూపులో ఉందంటే?
T20 ప్రపంచ కప్ కోసం ICC 20 జట్లను 4 గ్రూపులుగా విభజించిందిదీని ప్రకారం ఒక గ్రూప్‌లో 5 జట్లు ఉంటాయి. టీమ్ ఇండియాతో పాటు గ్రూప్-ఎలో పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ ఉన్నాయి. గ్రూప్ Bలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఉన్నాయి. గ్రూప్ సిలో న్యూజిలాండ్, రెండుసార్లు ప్రపంచకప్ విజేతలు, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూ గినియా ఉన్నాయి. గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ఉన్నాయి.