Cricket
T20 World Cup 2024: 4 ఓవర్లు.. 4 మెయిడిన్లు.. 3 వికెట్లు.. ప్రపంచకప్‌లో పెను సంచలనం.. బంతులు కావవి బుల్లెట్లు
టీ20 క్రికెట్ లో ఒక ఓవర్ మెయిడిన్ వేయడమే గొప్ప.. మరీ అరివీర భయంకర బౌలర్లైతే ఒక రెండు ఓవర్లు మెయిడెన్ వేయవచ్చు. కానీ న్యూజిలాండ్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ ప్రపంచ క్రికెట్ లోనే అత్యంత పొదుపుగా బౌలింగ్ చరిత్ర సృష్టించాడు. 4-4-0-3.. ఇవి పాపువా న్యూగినీతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఫాస్ట్‌బౌలర్ లాకీ ఫెర్గూసన్ గణంకాలు. వేసిన నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వకుండా అన్నింటినీ మెయిడిన్ చేసి సంచలనం సృష్టించడీ కివీ బౌలర్. అంతేకాదు మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా సోమవారం (జూన్ 18)న న్యూజిలాండ్, పపువా న్యూ గినియా జట్లు తల పడ్డాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తమ కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ కివీస్ బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా లాకీ ఫెర్గూసన్ చరిత్రాత్మక ప్రదర్శన చేశాడు. తన నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అన్నింటినీ మెయిడిన్ చేశాడు. అలాగే మూడు వికెట్లు పడగొట్టాడు.
PNG ఇన్నింగ్స్‌లో లాకీ నాల్గవ, ఆరవ, పన్నెండు, పద్నాలుగో ఓవర్‌లను బౌల్డ్ చేశాడు. నాలుగో ఓవర్ తొలి బంతికే పీఎన్‌జీ కెప్టెన్ అసద్ వాలాను లాకీ అవుట్ చేశాడు. ఆ తర్వాత ఆరో ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత 12వ ఓవర్లో 1 వికెట్ తీశాడు. అలాగే 14వ ఓవర్‌లోనూ ఇదే పునరావృతమైంది. ఈ ఓవరల్ లో రెండు పరుగులు బైస్ రూపంలో వచ్చాయి. అయితే అవి బౌలర్ ఖాతాలో చేరవు.
కాగా, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక బౌలర్ నాలుగు మెయిడిన్లు వేయడం ఇది రెండోసారి. గతంలో కెనడా కెప్టెన్ షాద్ బిన్ జాఫర్ 2021లో పనామాపై 4 ఓవర్లలో 1 పరుగు ఇవ్వకుండా 2 వికెట్లు పడగొట్టాడు.