Andhrapradesh

శ్రీవారి భక్తులు త్వరపడండి – జులై సేవా టికెట్లు విడుదల – ఎప్పుడంటే – Srivari Ticket Issue

Published

on

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. జులైకు సంబంధించిన సేవా టికెట్లను ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల లక్కీ డిప్​నకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్​ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. లక్కీ డిప్​లో టికెట్లు పొందిన వారు చెల్లింపులు చేసి ఖరారు చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.

Tirumala Tirupati Devastanam : ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్​ సేవా టికెట్లును టీటీడీ విడుదల చేయనుంది. అదే రోజు వర్చువల్​ సేవా టికెట్లతో పాటు స్వామి వారి దర్శన స్లాట్​లను కూడా విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు శ్రీవారి అంగ ప్రదక్షిణం టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు టోకెన్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

తిరుమల టైం స్లాట్​ టోకెన్ల జారీలో ప్రైవేట్ వాహన డ్రైవర్ల మోసాలు- భక్తులకు తీవ్ర ఇక్కట్లు! – Tirumala Time Slot Tokens Issue

Tirumala Ticket Issue Date : తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. శ్రీవారి సర్వ దర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 77,511 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,553 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు అని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version