Spiritual
Special Buses To Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
Special Buses To Srisailam : మహాశివరాత్రి (Maha Shiva Ratri 2024)పర్వదినం సందర్భంగా శ్రీశైలం(Srisailam) మల్లన్న క్షేత్రంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. దూర ప్రాంతాల నుంచి శ్రీశైలం వచ్చే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మల్లిఖార్జునస్వామి, భ్రమరాంబిక తల్లిని దర్శించుకునేందుకు శివరాత్రి నాడు పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి వస్తుంటారు. మహాశివరాత్రి రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC Buses) కీలక ప్రకటన చేసింది. కర్నూలు డిపో నుంచి శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. కర్నూలు డిపో నుంచి 310 బస్సు సర్వీసులను శ్రీశైలం క్షేత్రానికి నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కర్నూలు మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ బస్సు సర్వీసులను వాడుకోవాలని అధికారులు తెలిపారు. మార్చి 5న తేదీ నుంచి ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శ్రీశైలంలో మార్చి11 వరకు శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మార్చి 12వ తేదీ వరకూ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. కర్నూలు డిపో నుంచి వెంకటాపురం వరకు రూ.150 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. రద్దీ దృష్ట్యా మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తేస్తామన్నారు.