Andhrapradesh
సాఫ్ట్‌వేర్ టు పాలిటిక్స్
ఇచ్ఛాపురం:సామాన్యగృహిణి నుంచి భర్త, మామ అడుగు జాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించడం, జెడ్పీ చైర్ పర్సన్‌గా తనదైన పనితీరు కనబరచడం, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక కావడం వర కు పిరియా విజయ ప్రస్థానం ఓ సినిమా కథను తలపిస్తుంది.
పిరియా సాయిరాజ్ భార్యగా అందరికీ చిరపరిచితురాలైన పిరియా విజ య కవిటి మండల జెడ్పీటీసీగా ఎన్నికయ్యాక జెడ్పీ చైర్ పర్సన్ పదవికి ఎంపికయ్యారు. ఇప్పుడు ఇచ్ఛాపురం అసెంబ్లీ సీటు కేటాయించారు. ఆమె పనితీరుకు దక్కిన ఫలితమిది. ఆమె 2001 నుంచి 2009 వరకు హింద్ ఇన్ఫో వే సాఫ్ట్‌వేర్ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరించారు.
2009 నుంచి 14 మధ్యలో సోంపేట థర్మల్ పవర్‌ప్లాంట్ ఉద్యమంలో నిరస న కార్యక్రమాల్లో భర్త సాయిరాజ్‌తో కలిసి కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా ఉద్దానం ఫౌండేషన్ ట్రస్టీగా ఉంటూ ఉచిత అంబులెన్స్ సర్వీసులను న డుపుతూ రోగులకు సేవలందించారు. కిడ్నీ వ్యాధి తో మృతిచెందిన తల్లిదండ్రుల పిల్లలను దత్తత తీసుకొని వారికి చదువులు చెప్పిస్తున్నారు. ఆమెతోపాటు భర్త సాయిరాజ్, మామ రాజారావులు సైతం ప్రజాసేవలో తమవంతు పాత్రను పోషిస్తూ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్నారు.