National

తుపాకీతో కాల్చుకుని సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

Published

on

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ (SRPF) జవాన్ ప్రకాశ్ కపడే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. సెలవుపై తన స్వస్థలం జలగావ్ జిల్లా జమ్నేర్‌కు వెళ్లిన ప్రకాశ్.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. తుపాకితో తనకు తానుగా మెడపై కాల్చుకున్నట్టు చెప్పారు. 39 ఏళ్ల కపడేకు భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్టు జమ్నేర్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి కిరణ్ షిండే పేర్కొన్నారు.

జవాన్ ఆత్మహత్యకు గత కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు జరుపుతున్నామని ఆయన వివరించారు. ‘పలు వ్యక్తిగత కారణాలతోనే ప్రకాశ్ కపడే ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించాం.. కానీ, పూర్తిస్థాయి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నాం’ అని షిండే అన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రకాశ్ కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు, ఇతరు వ్యక్తులు సహా పలువుర్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు, వీవీఐవీ భద్రత కోసం నియమించిన గార్డు ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘటనపై SRPFస్వతంత్ర దర్యాప్తు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version