Career
SEBI Recruitment 2024: సెబీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్; ఇలా అప్లై చేసుకోండి..
SEBI Recruitment 2024: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఇటీవల ఒక రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 97 గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు ఆన్ లైన్ లో ఏప్రిల్ 13 వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి ప్రకటన, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఏప్రిల్ 13న సెబీ అధికారిక వెబ్సైట్ www.sebi.gov.in లో అందుబాటులో ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.sebi.gov.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 97 గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
సెబీ రిక్రూట్మెంట్ 2024 ఖాళీల వివరాలు: ఈ SEBI Recruitment 2024 ద్వారా జనరల్ స్ట్రీమ్, లీగల్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్, రీసెర్చ్ స్ట్రీమ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ లో 97 గ్రేడ్ ఎ (అసిస్టెంట్ మేనేజర్) ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
సెబీ రిక్రూట్మెంట్ 2024 వయోపరిమితి: అభ్యర్థుల గరిష్ట వయస్సు 2024 మార్చి 31 నాటికి 30 ఏళ్లు ఉండాలి.
సెబీ రిక్రూట్మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ: మూడు దశల్లో ఎంపిక జరుగుతుంది. మొదటి దశలో రెండు పేపర్లతో కూడిన ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఫేజ్ 1లో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఫేజ్ 2కు హాజరవుతారు. ఇది కూడా రెండు పేపర్ల ఆన్లైన్ పరీక్ష రూపంలో ఉంటుంది. ఫేజ్-2లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
సెబీ రిక్రూట్మెంట్ 2024 అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు ఇంటిమేషన్ ఫీజుగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.