Andhrapradesh
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు జూన్ 11 వరకు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 12న స్కూళ్లు తెరుచుకోవాలి. కానీ కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో సెలవులు పొడగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.. ఎందుకంటే
ఏపీలో మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. ఇప్పటికే స్కూళ్ల పున: ప్రారంభంపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణాలో బడిబాట కార్యక్రమం కూడా ప్రారంభమై అడ్మిషన్ల కోసం టీచర్లు ఊళ్ల బాట పడుతున్నారు.
అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం వైదొలిగి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానుంది. జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అదే రోజు స్కూళ్ల రీఒపెన్ ఉండడంతో సెలవులు పొడగించాలని వినతులు వస్తున్నాయి.