Andhrapradesh
SBI: ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్.. ఎప్పుడైనా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
SBI MOD Interest Rate: భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషల్ డిపాజిట్ పథకం లాంఛ్ చేసింది. అదే మల్టీ ఆప్షన్ డిపాజిట్ అకౌంట్ (MOD). వాస్తవానికి ఇది కూడా ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. అయినా కూడా ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్లలా కాకుండా.. దీంట్లో పొదుపు చేసిన డబ్బుల్ని మీకు నచ్చినప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. సాధారణ FD స్కీమ్స్‌లో పొదుపు చేసినట్లయితే దాంట్లోని మొత్తాన్ని నిర్దిష్ట సమయం వరకు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుండదు. కానీ ఈ SBI MOD అకౌంట్లో పొదుపు చేసిన మొత్తాన్ని మీరు నచ్చినప్పుడు పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. ఇంకా ఇందుకోసం ఎలాంటి అదనపు రుసుములు, పెనాల్టీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ ఎస్‌బీఐ స్పెషల్ ఎంఓడీ అకౌంట్ నుంచి రూ. 1000, రూ. 2 వేలు, రూ. 3 వేలు ఇలా 1000 మల్టిపుల్స్‌తో విత్‌డ్రా చేసుకోవచ్చు. అకౌంట్లోని మిగతా మొత్తానికి ముందుగా నిర్ణయించినట్లుగా వడ్డీ లభిస్తుంటుంది.
>> మీరు డైరెక్ట్‌గా ఎస్‌బీఐ బ్రాంచుకు వెళ్లి ఎస్‌బీఐ ఎంఓడీ అకౌంట్ తెరవొచ్చు. లేదా SBI పోర్టల్‌తో ఆన్‌లైన్‌లోనే ఈ డిపాజిట్ తెరవొచ్చు. మీరు అర్జెంట్‌గా డబ్బులు తీసుకోవాలనుకుంటే నేరుగా ఏటీఎంకు వెళ్లి మనీ తీసుకోవచ్చు. లేదా చెక్ రూపంలోనూ డబ్బులు ఉపసంహరించుకోవచ్చు.
ఈ స్పెషల్ స్కీంలో సాధారణ ఖాతాదారులకు 7 శాతం వడ్డీ లభిస్తుంది. అదే సీనియర్ సిటిజెన్లకు అయితే 0.50 శాతం వడ్డీ అదనంగా వస్తుంది. అంటే వీరికి 7.50 శాతం వడ్డీ వస్తుందన్నమాట.
>> భారతీయ పౌరులు ఎవరైనా ఈ స్పెషల్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. భారత్‌లో నివసిస్తున్న వారితో పాటు.. ప్రవాస భారతీయులు కూడా ఈ ఎఫ్‌డీ స్కీంలో చేరొచ్చు. ఇంకా హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF), కంపెనీలు కూడా ఈ స్కీంలో చేరేందుకు అవకాశం ఉంటుంది
ఎస్‌బీఐ ఇంకా రెగ్యులర్ డిపాజిట్లతో పాటుగా.. ఎన్నో స్పెషల్ ఫిక్స్‌డ్ స్కీమ్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిల్లో 400 రోజుల స్పెషల్ టెన్యూర్‌తో అమృత్ కలశ్ సహా సీనియర్ సిటిజెన్ల కోసం ఎస్‌బీఐ వీకేర్ ఎఫ్‌డీ, ఇంకా సర్వోత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్, ఎస్‌బీఐ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ వంటివి చాలానే ఉన్నాయి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఎక్కడైనా రెగ్యులర్ సిటిజెన్లతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ ఎక్కువగా అందుతుంది