International

Russian plane crash: రష్యాలో కుప్పకూలిన విమానం; ప్రయాణికులు దుర్మరణం

Published

on

Russian plane crash: ఉక్రెయిన్ తో యుద్ధం కొనసాగుతున్న వేళ, రష్యాలోని ఇవనోవో ప్రాంతంలో మిలటరీ విమానం ఒకటి కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో ఆ మిలటరీ విమానంలో ప్రయాణిస్తున్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఎనిమిది మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

మాస్కోకు ఈశాన్యంగా ఉన్న ఇవనోవో ప్రాంతంలో 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కార్గో విమానం కూలిపోయింది. పశ్చిమ రష్యాలోని వైమానిక స్థావరం నుంచి ఇల్యూషిన్ ఐఎల్-76 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య కారణంగా (Flight accident) కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో ఇంజిన్ లో మంటలు చెలరేగడమే ప్రమాదానికి కారణమని రష్యా రక్షణ మంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎనిమిది మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని రష్యా మీడియా ప్రకటించింది.

Advertisement

అగ్నికీలలకు ఆహుతి..
మాస్కో టైమ్స్ పోస్ట్ చేసిన వీడియోలో.. టేకాఫ్ అయిన కాసేపటికి విమానంలో మంటలు చెలరేగడం స్పష్టంగా కనిపించింది. ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేసిన మరొక వీడియోలో, ఒక ఇంజిన్ లో మంటలు చెలరేగుతుండగా విమానం కిందకు వెళ్తుండటం, విమానం కూలిపోతున్నప్పుడు నల్లటి పొగలు ఎగిసిపడటం చూడవచ్చు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: పోప్ ‘తెల్లజెండా’ పిలుపును విమర్శించిన ఉక్రెయిన్, రష్యాకు లొంగిపోనని ప్రతిజ్ఞ
జనవరిలో రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఇలాంటి రష్యా ఐఎల్ -76 సైనిక రవాణా విమానం కూలి 65 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేసిందని ఆరోపించిన రష్యా 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు ఖైదీల మార్పిడికి వెళ్తుండగా అందులో ఉన్నారని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version