Hyderabad

RS Praveen Kumar : కాంగ్రెస్ గేట్లు తెరిస్తే చేరడానికి అసమర్థుడిని కాదు, బీఆర్ఎస్ లో చేరుతున్నా- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Published

on

RS Praveen Kumar Joins BRS : బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి(BSP) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గేట్లు తెరిస్తే వెళ్లిన గొర్రెల్లాగా తాను కాదని అన్నారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ (TSPSC Chairman)పదవి ఆఫర్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నుంచి కబురు వచ్చిందని, కానీ ఆ పదవిని తాను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. తనకు ఏ పదవులు అవసరం లేదన్నారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను బీఆర్ఎస్ లోకి చేరితే ప్రజలకు సమాధానం చెప్పాలనడం ఎంత వరకూ కరెక్ట్ అన్నారు. తెలంగాణ ప్రజలకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే అందులో చేరడానికి తాను అసమర్థుడిని కానన్నారు. నిజాయతీ కోసం పనిచేసే వ్యక్తినన్నారు.

నేను కూడా పాలమూరు బిడ్డే
తాను ఎప్పుడూ నిజాయితీకి కట్టుబడి ఉన్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఓ వైపు మంచివాడు అంటూనే రేవంత్‌ రెడ్డి విమర్శిస్తున్నారన్నారు. ఎన్ని కోట్లు తీసుకుని బీఆర్ఎస్(BRS) లో చేరుతున్నావని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. డబ్బు కోసం అయితే కాంగ్రెస్‌లో చేరుతా కానీ బీఆర్ఎస్‌ కాదు కదా అన్నారు. నా గుండెల్లో ఎప్పుడూ బహుజన వాదం ఉంటుందన్నారు. బహుజనులు సంక్షేమం కోసమే పోరాడుతానన్నారు. రేవంత్ రెడ్డే కాదు తాను కూడా పాలమూరు బిడ్డనేనన్నారు.

కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి
తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌… గజ్వేల్‌లోని కేసీఆర్‌ ఫామ్ హౌస్‌కు(KCR Farm House) ర్యాలీగా బయలుదేరారు. ఫామ్ హౌస్‌ లో కేసీఆర్‌ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇతర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version