Cricket

Rohit Sharma: ఏం బాదుడు భయ్యా.. సిక్సర్ల వీరుడు.. రోహిత్ శర్మ మరో ఘనత

Published

on

అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. బుధవారం ఐర్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచులో మూడు సిక్సులు కొట్టి ఇప్పటివరకు మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి 600 సిక్సులు కొట్టిన మొనగాడిగా నిలిచాడు.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ 140.54 స్ట్రైక్ రేట్‌తో 37 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచుతో రోహిత్ మరో ఘనత కూడా అందుకున్నాడు.

భారత ఓపెనర్ విరాట్ కోహ్లీ తర్వాత క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ 4,000కు పైగా పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. టీ20ల్లో 144 మ్యాచ్‌లలో 32.20 సగటుతో, 139.98 స్ట్రైక్ రేట్‌తో రోహిత్ మొత్తం 4,026 పరుగులు బాదాడు.

వాటిలో 5 సెంచరీలు, 30 అర్ధసెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ టెస్టుల్లో 4,137 పరుగులు, వన్డేల్లో 10,709 పరుగులు, టీ20ల్లో 4001 పరుగులు చేశాడు. కాగా, విరాట్ కోహ్లీ టెస్టుల్లో 8,848 పరుగులు, వన్డేల్లో 13,848 పరుగులు, టీ20ల్లో 4,038 పరుగులు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version