International

‘గత ఒప్పందాల పట్ల గౌరవం ఉండాలి- బార్డర్​లో శాంతి ఉంటేనే చైనాతో సత్సంబంధాలు!’ : జైశంకర్

Published

on

Jaishankar meets Chinese FM : చైనాతో సంబంధాలను ‘స్థిరపరచడానికి’, ‘పునర్నిర్మించడానికి’ వాస్తవాధీన రేఖతో పాటు గత ఒప్పందాల పట్ల ‘పూర్తి గౌరవం’ ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్ అన్నారు. ఆసియాన్‌ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో జైశంకర్‌ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేసేదిశగా ఇరునేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు మంత్రి చెప్పారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చను కొనసాగించినట్టు భేటీ అనంతరం జైశంకర్ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. సరిహద్దుల్లో పరిస్థితి తప్పనిసరిగా ఇరుదేశాల సంబంధాలపై ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సంబంధాలు మామూలుగా ఉండవని భారత్ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version