National

Rajya Sabha elections: నేడు 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు, ఫలితాలు కూడా

Published

on

దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు(Rajya Sabha seats) నేడు (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని 10, కర్ణాటకలో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. 15 స్థానాల్లో హోరాహోరీ పోటీ జరగనుండగా..మూడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాల కంటే ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

ప్రతి రెండేళ్లకు కనీసం 33 శాతం రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు(Rajya Sabha elections) జరుగుతాయి. 15 రాష్ట్రాల నుంచి 56 మంది రాజ్యసభ ఎంపీల ఎంపికకు కూడా ఫిబ్రవరి 27నే ఎంచుకున్నారు. అయితే 12 రాష్ట్రాల నుంచి చాలా సీట్లు ఖాళీగా ఉండటంతో అంతే సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో 12 రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా రాజ్యసభ ఎంపీలు అయ్యారు. ఇప్పుడు మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఓటింగ్(voting) జరగనుంది. మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన 8 మంది, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 3 మంది ఉన్నారు. 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో కేవలం 397 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version